Kishan Reddy: సీఎం రేవంత్ దావోస్ టూర్.. కిషన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

by Shiva |
Kishan Reddy: సీఎం రేవంత్ దావోస్ టూర్.. కిషన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దావోస్ (Davos) పర్యటనపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌ (Hyderabad)లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఇక్కడున్న వారినే దావోస్ (Davos) తీసుకెళ్లి ఒప్పందాలు చేసుకున్నారంటూ కామెంట్ చేశారు. తెలంగాణ (Telangana)లో ఎవరూ కాంట్రాక్టులు చేయడం లేదని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ (Real Estate) రంగం పూర్తిగా కుదేలైందని అన్నారు. దావోస్ (Davos) పర్యటనతో లాభం చేకూరుతుందంటే ఎలాంటి వమర్శలు అవసరం లేదని తెలిపారు. కానీ, తెలంగాణ (Telangana) వారినే దావోస్ (Davos)తీసుకెళ్లి.. అక్కడ అగ్రిమెంట్లు (Agreements) చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. విదేశాల నుంచి రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని.. కేవలం ఒప్పందాలు పేపర్‌పైనే పరిమితం కావొద్దని కిషన్ రెడ్డి అన్నారు.



Next Story

Most Viewed