రాహుల్ గాంధీపై కిషన్ రెడ్డి ఆగ్రహం

by GSrikanth |   ( Updated:2023-07-15 13:25:50.0  )
రాహుల్ గాంధీపై కిషన్ రెడ్డి ఆగ్రహం
X

దిశ, డైనమిక్ బ్యూరో: మణిపూర్ అంశంపై రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాహుల్ వ్యాఖ్యలు సిగ్గుచేటని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ ఓ వైపు భారత అంతర్గత వ్యవహారాల్లో అంతర్జాతీయ జోక్యం ఉండాలని కోరుకుంటునే మరో వైపు భారతదేశ అంతర్గత విషయాలను బయటి వ్యక్తులు వ్యాఖ్యానించకూడదని కోరుకుంటున్నాడని విమర్శించారు. రాహుల్ కు గానీ కాంగ్రెస్ పార్టీకి గానీ భారత దేశం పట్ల ప్రేమ ఉందా అని నిలదీశారు. రాజకీయ అంశాల కోసం దేశ రక్షణ భద్రతను లాగటం సిగ్గుచేటని విమర్శించారు.

కాగా మోడీ ఫ్రాన్స్ పర్యటనపై ట్విట్టర్ వేదికగా స్పందించిన రాహుల్.. 'మణిపూర్ మండిపోతున్నది. ఈయూ పార్లమెంట్ భారత అంతర్గత వ్యవహారం గురించి చర్చించింది. కానీ ప్రధాని మాత్రం ఒక్క మాట మాట్లాడలేదు. ఇదే సమయంలో రఫేల్ వల్ల ఆయనకు బాస్టీల్ డే పరేడ్ కు టికెట్ లభించింది' అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై బీజేపీ ఎటాక్ చేస్తున్నది. రాహుల్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. రాహుల్ గాంధీ విసుగు చెందిన వారసుడు అని మేకిన్ ఇండియా ఆశయాలను తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. వారి కాళ్ల వద్దకు రక్షణ ఒప్పందాలు రావడం లేదని నిరాశలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రధానికి గౌరవం లభిస్తే అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story