మున్నేరు వంతెనపై రాకపోకలు బంద్​

by Sridhar Babu |
మున్నేరు వంతెనపై రాకపోకలు బంద్​
X

దిశ, ఖమ్మం సిటీ : ఖమ్మం నగరంలోని ప్రకాష్ నగర్ మున్నేరు వంతెన మరమ్మతులు పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయ మార్గాలలో వాహనాల రాకపోకలు కొనసాగించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కోరారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఖమ్మం నగరంలోని ప్రకాష్ నగర్ మున్నేరు వంతెన స్పాన్ బేరింగ్ పై నుంచి పక్కకు జరిగిన దృష్ట్యా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఆర్అండ్​బీ అధికారులు మరమ్మతుల కోసం వంతెన ఇరువైపులా గోడ నిర్మాణం చేపట్టారని తెలిపారు. తదుపరి సూచనల వరకు భారీ వాహనాల (బస్సులు, లారీలు, గూడ్స్ క్యారియర్లు మొదలైనవి) రాకపోకలు నిలిపివేసినట్టు చెప్పారు.

అన్ని భారీ వాహనాలు శ్రీ శ్రీ సర్కిల్ - బైపాస్ రోడ్డు మీదుగా కరుణగిరి వంతెన - వరంగల్ క్రాస్ రోడ్డు మీదుగా వెళ్లాలని, పాత బస్టాండ్ నుండి కోదాడ లేదా వరంగల్ వైపు వెళ్లే బస్సులు పాత బస్టాండ్-మయూరి బ్రిడ్జ్ - జూబ్లీ - నెహ్రూ సర్కిల్- ఎఫ్ సీ ఐ గోడౌన్ - కరుణగిరి - వరంగల్ క్రాస్ రోడ్ నుండి వెళ్లాలని, కొత్త బస్టాండ్ నుండి కోదాడ లేదా వరంగల్ వైపు వెళ్లే బస్సులు కొత్త బస్టాండ్-కరుణగిరి బ్రిడ్జ్-వరంగల్ క్రాస్ రోడ్ నుండి వెళ్లాలని కోరారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు మొదలైన అన్ని తేలికపాటి మోటారు వాహనాలు పాత మున్నేరు వంతెన (కాల్వ ఒడ్డు) గుండా వెళ్లాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed