‘సమాచార హక్కు చట్టానికి తూట్లు?’.. నిబంధనలకు విరుద్ధంగా వార్డెన్ తీరు!

by Jakkula Mamatha |
‘సమాచార హక్కు చట్టానికి తూట్లు?’.. నిబంధనలకు విరుద్ధంగా వార్డెన్ తీరు!
X

దిశ, మయూరి సెంటర్: ప్రభుత్వ కార్యాలయంలో జరిగే పనులు, ఖర్చులు, నిధుల వివరాలు, తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమాచార హక్కు చట్టం- 2005ను తీసుకొచ్చింది. వివిధ ప్రభుత్వ కార్యాలయాలలోకి వెళ్లగానే ముందుగా పౌరులకు దర్శనమించే బోర్డు సమాచార హక్కు చట్టం. ప్రభుత్వ కార్యాలయాల అధికారిక వెబ్సైట్‌లో నుంచి సమాచారం ఎలా పొందాలి? అధికారుల వివరాలు, ఆఫీస్ అడ్రస్, సమాచారం ఇచ్చే అధికారి వివరాలు తదితర వివరాలు ఉంటాయి. కానీ ఖమ్మం ప్రభుత్వ వెనుకబడిన తరగతుల ఆధ్వర్యంలో నడిచే వెనుకబడిన తరగతుల కళాశాల బాలుర వసతి గృహం ఖమ్మంలో మాత్రం పౌర సమాచార అధికారి నిబంధనలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి.

ఖమ్మం పట్టణానికి చెందిన ఓ వ్యక్తి, సమాచార హక్కు చట్టం ద్వారా ఖమ్మం BSNL ఆఫీస్‌కు ఎదురుగా ఉన్న బీసీ బాలుర కళాశాల వసతి గృహ సమాచార అధికారి( పీఐవో)కి దరఖాస్తు చేశారు. దరఖాస్తు పరిశీలించి 30 రోజుల్లో దరఖాస్తుదారునికి సమాచారం ఇవ్వవలసిన హాస్టల్ వార్డెన్, ఉద్దేశపూర్వకంగా పేపర్‌కు రెండు రూపాయలు చొప్పున సుమారు పది వేలు కట్టాలంటూ తిరిగి లేఖ పంపినట్లు తెలుస్తోంది. దరఖాస్తుదారుడు దరఖాస్తు చేసే సమయానికి అప్పటివరకు హాస్టల్‌లో వార్డెన్‌గా పనిచేసిన అధికారి బదిలీపై వెళ్లారు. బదిలీ అయిన అధికారినే లేఖ తయారు చేసి, కొత్తగా వచ్చిన హాస్టల్ వార్డెన్‌తో సంతకం చేయించి రిప్లై లేఖ పంపినట్టు తెలుస్తుంది. దరఖాస్తుదారుడు సహా చట్టం కింద సమాచారం పొందాలంటే, కాఫీకి రెండు రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. సదరు అధికారి మొత్తం పేజీలను లెక్కించి దరఖాస్తు దానికి డిమాండ్ డ్రాప్( డిడి ) రూపంలో డబ్బులు చెల్లించాలి అని చట్ట ప్రకారం తెలియజేయాల్సి ఉంటుంది. ఇలా మొత్తం పేజీలు ఏమీ లెక్కించకుండానే ఉద్దేశపూర్వకంగా దరఖాస్తుదారుని తప్పుదోవ పట్టించే విధంగా లేఖ పంపారని దరఖాస్తుదారుడు వాపోతున్నారు.

హాస్టల్ రికార్డుల్లో డేటా బయటకు రాకుండా..

తాజాగా ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిన హాస్టల్ వార్డెన్ పై ఇక్కడ పనిచేసిన సమయంలో అనేక ఆరోపణ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ విధులు నిర్వహించిన సమయంలో ప్రభుత్వం అందించే నెల నెల ఇచ్చే బియ్యం, గ్యాస్ బిల్లులు, విద్యార్థుల హాజరు నమోదు, కూరగాయలు, నిత్యావసర సరుకులు, తదితరు లెక్కల్లో తేడాలునట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సదర్ వార్డెన్ రికార్డుల్లో ఉన్న డేటాను రాకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా అధికారులు వార్డెన్ పై చర్యలు తీసుకుని, దరఖాస్తుదారునికి పూర్తి సమాచారం ఇవ్వాలని పలువురు సహా చట్ట కార్యకర్తలు కోరుతున్నారు.

Advertisement

Next Story