అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు.. గాయం తిరుపతిరావు

by Sumithra |
అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు.. గాయం తిరుపతిరావు
X

దిశ, కల్లూరు : పెనుబల్లి మండల సీపీఎం నాయకులను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూములను వేలం వేయటాన్ని నిరసిస్తూ హైదరాబాద్ వెళ్లటానికి బయలుదేరిన సీపీఎం కార్యకర్తలను ఆదివారం అర్ధరాత్రి అరెస్టు చేయటం దుర్మార్గపు చర్య అని సీపీఎం మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించేటటువంటి విలువైన హెచ్సీయూ యూనివర్సిటీ భూములను వేలం పెట్టడం అంటే తెలంగాణ విద్యార్థి లోకానికి తీవ్ర నష్టం అని వారు పేర్కొన్నారు.

యూనివర్సిటీ విద్యార్థులు జరిపే నిరసనకు సీపీఎం, ఎస్ఎఫ్ఐ మద్దతు ప్రకటించింది ఈ మద్దతుకు బయలుదేరిన సీపీఎం ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను చిమట విశ్వనాథం, బెజవాడ సాయి, శేషు, గుడిమెట్ల బాబు, కార్యకర్తలను ప్రభుత్వం అప్రజాస్వామికంగా అరెస్టులు చేసినంత మాత్రాన ఉద్యమాలను ఆపలేరని ఇప్పటికైనా ప్రభుత్వం యూనివర్సిటీ భూముల వేలాన్ని ఆపి విద్యారంగాన్ని రక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ భూములను కాపాడటం కోసం తెలంగాణ ప్రజలందరూ ముక్తకంఠంతో ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించాలని కోరారు.

Next Story

Most Viewed