విద్యార్థినీల పట్ల ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన

by Sridhar Babu |
విద్యార్థినీల పట్ల ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన
X

దిశ, ములకలపల్లి : మూకమామిడి (గుట్టగూడెం) ప్రాథమికోన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ (ఎస్జీటీ) విద్యార్థినీలపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినీలు తల్లిదండ్రులకు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు మంగళవారం వారి తల్లిదండ్రులు సదరు ఉపాధ్యాయుడిని నిలదీశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి, అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేశారు. మండల విద్యాశాఖ అధికారి శ్రీరామమూర్తి ఘటన జరిగిన మూకమామిడి పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed