- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'వారికి టిక్కెట్ ఇస్తే పార్టీకి మద్దతు ఇవ్వం'
దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఆశావహుల పై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. రాబోయే ఎన్నికల్లో టికెట్ నాకంటే నాకు వస్తుందని భావించిన ఇద్దరు ఆశావహులకు సీనియర్లు మొండి చెయ్యి చూపిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో బట్ట విజయగాంధీ లేదా చందా సంతోష్ కి గాని టిక్కెట్ ఇస్తే పార్టీ ఏ మాత్రం మద్దతు తెలుపబోమని పార్టీ సీనియర్ నాయకులు తెగేసి చెబుతున్నారు. వారి వల్ల పార్టీకి వరిగేది కూడా ఏమి లేదంటున్నారు.
మెడలో కాంగ్రెస్ కండువా కప్పుకొని సోషల్ మీడియాలో పోస్టులు పెడితే టిక్కెట్ వస్తున్నదని ఆశపడటం వారి అవివేకమంటున్నారు. ఏనాడు పార్టీకి కష్టపడి పనిచేసిన దాఖలాలు లేవని విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం పినపాక టిక్కెట్ పాయం వెంకటేశ్వర్లు, పోలేబోయిన శ్రీవాణి లేదా దనసరి సూర్యకు ఇస్తేనే సంపూర్ణ మద్దతు తెలుపుతామని పార్టీ సీనియర్లు మొండికేస్తున్నారు. ఏది ఏమైనా టిక్కెట్ పాయం, శ్రీవాణి లేదా సూర్యకు వస్తేనే పినపాక కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని సీనియర్లు ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు. మరి కాంగ్రెస్ అధిష్టానం పినపాక టిక్కెట్ ఎవరికి కట్టపెడుతుందో వేచి చూడాల్సిందే.