అనుమతులు లేకుండా వెంచర్లు నిర్మిస్తే కఠిన చర్యలు: అసిస్టెంట్ కలెక్టర్

by Disha News Desk |
అనుమతులు లేకుండా వెంచర్లు నిర్మిస్తే కఠిన చర్యలు: అసిస్టెంట్ కలెక్టర్
X

దిశ,తిరుమలాయపాలెం: లేవుట్ అనుమతులు లేకుండా వెంచర్లు నిర్మిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ మండల అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంలో వెంచర్లకు సంబంధించిన రికార్డులు ఆయన తనిఖీ చేసి, వాటి వివరాలు తహశీల్దార్ పుల్లయ్య ను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

దమ్మాయిగూడెం గ్రామం లో ఖమ్మం, వరంగల్ మెయిన్ రోడ్డు ప్రక్కన 30 ఎకరాల్లో ఏర్పాటు చేసిన శ్రీ నిధి వెంచర్ ను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వెంచర్లు నిర్మిస్తే..వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయరాం నాయక్, ఎంపీవో రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed