Minister Tummala Nageswara Rao : సీతారామ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలి...

by Sumithra |
Minister Tummala Nageswara Rao : సీతారామ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలి...
X

దిశ, ఏన్కూరు : సీతారామ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తిచేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. శనివారం హిమామ్ నగర్ , రేపల్లెవాడ గ్రామాల మధ్య జరుగుతున్న కాల్వ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు కాలువ పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

సీతారామ ప్రాజెక్టు లింకు కెనాల్ పూర్తయితే సాగునీరు, తాగునీరు అందుతాయని తెలిపారు. కెనాల్లో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని తెలిపారు. రాత్రింబవళ్లు సైతం పనులను కొనసాగించాలని మంత్రి కోరారు. సీతారామ లింక్ కెనాల్ పై బ్రిడ్జిలు, కల్వర్టులు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పువాళ్ళ దుర్గాప్రసాద్, వాసిరెడ్డి నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed