ప్రజలు చైతన్యం కావాలి : Teenmar Mallanna

by Sridhar Babu |   ( Updated:2022-12-14 14:36:20.0  )
ప్రజలు చైతన్యం కావాలి : Teenmar Mallanna
X

దిశ,మణుగూరు : తెలంగాణ ప్రజలు చైతన్య వంతం కావాలని, ఈసారి జరగబోయే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని తీన్మార్ మల్లన్న కోరారు. బుధవారం మణుగూరులో జరిగిన రోడ్ షో లో మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏం జరుగుతుందో..ఎవరెవరు వచ్చి కలుస్తున్నారో ప్రజలందరికీ తెలిసేవిధంగా ఉండాలన్నారు. ప్రజలు ఓట్లకోసం అమ్ముడుపోవద్దని హితవు పలికారు. మహిళలు ముందుకు పోవాలంటే...కవిత ఒకడుగు ముందుకేసి లిక్కర్ పట్టుకుని ఢిల్లీ పోయిందని ఎద్దేవా చేశారు. పేదవాళ్లకి ఒక న్యాయం.. కేసీఆర్ కూతురికి ఒకన్యాయమా... అని ప్రశ్నించారు. అక్రమ మార్గంలో గద్దెనెక్కినోళ్లు పరిపాలన సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలకు విద్య, వైద్యం, సత్వర న్యాయాన్ని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ప్రజలు వడ్లకు మద్దతు ధర కావాలని అడుగుతుంటే...కేసీఆర్ మాత్రం ఓట్లకు మద్దతు ధర అడుగుతున్నాడని ఎద్దేవా చేశారు. మన హక్కులు మనం తెలుసుకోవాలని..ఒకవేళ ఉద్యోగులు ఎవరైనా హక్కులకోసం పోరాడితే వారికి మెమోలిచ్చే ప్రభుత్వం ఇదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఏం చేశారని ఆయనకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. మరోసారి కేసీఆర్ వస్తే పేదల జీవితాలు మరింత దౌర్భాగ్యంగా మారతాయన్నారు. దయచేసి ఎవరూ అమ్ముడుపోవద్దని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story