- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ హామీలతో మోసపోయిన ప్రజలు : ఎంపీ రవిచంద్ర
దిశ, కొత్తగూడెం : కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో అలవికాని హామీలివ్వడంతో ప్రజలు మోసపోయి మంచి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నారని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కాంగ్రెస్ ఏడాది ప్రభుత్వాన్ని, కేసీఆర్ సుపరిపాలనను పోల్చుకుంటూ ప్రజలిప్పుడు బాధపడుతున్నారన్నారు. దీక్షాదివస్ సందర్భంగా ఇంఛార్జిగా నియమితులైన ఎంపీ రవిచంద్ర కొత్తగూడెం తెలంగాణ భవన్ లో జరిగిన సభలో ఉత్తేజిత ప్రసంగం చేశారు. సభలో ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి ప్రజల 69 ఏళ్ల ఆకాంక్షను నెరవేర్చారని, ఉద్యమాన్ని ఆయన చేపట్టకుంటే తెలంగాణ ఏర్పాటు జరిగి ఉండేది కాదన్నారు.
మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కారణజన్ముడు అని, తాను సాధించి పెట్టిన తెలంగాణకు పదేళ్లు సారథ్యం వహించి అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చేశారని అన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని కేసీఆర్ బంగారుమయంగా తీర్చిదిద్దితే కాంగ్రెస్ ఏడాది పాలనలో సంక్షోభంలో కూరుకుపోయిందని, కేసీఆర్ సుపరిపాలనను రేవంత్ రెడ్డి ఏడాది ప్రభుత్వాన్ని చూసిన ప్రజలు ఇక భవిష్యత్తులో జాతీయ పార్టీలకు ఓట్లేసే పరిస్థితి కనిపించడం లేదని అన్నారు.
ఇక ముందు రానున్న అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం తథ్యమని అన్నారు. కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో దీక్ష దివస్ సందర్భంగా పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అంతకుముందు కొత్తగూడెంలోని రైల్వే స్టేషన్ నుండి భారీ బైక్ ర్యాలీతో బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ ఎస్ జిల్లా కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేంద్రరావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, దిండిగాల రాజేందర్, వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.