- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేదలకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అందాలి
దిశ, కొత్తగూడెం : అత్యంత నిరుపేదలకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు అవ్వాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. శుక్రవారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ, జిల్లాలో నెలకొన్న భూ సమస్యలపై ఆర్డీఓలు, జిల్లా అధికారులు, జిల్లాలోని తహసీల్దార్లతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే డేటా ఎంట్రీ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. కొత్తగూడెం లక్ష్మీదేవి పల్లి, పాల్వంచ, అశ్వరావుపేట, చర్ల మండలాల్లో డేటా ఎంట్రీ పురోగతిపై అసహనం వ్యక్తం చేశారు.
కరకగూడెం,చర్ల మండలాలు ఆరు మూల ప్రాంతాల్లో ఉండటం, విద్యుత్ అంతరాయం, నెట్వర్క్ సమస్య డేటా ఎంట్రీ ఆపరేటర్లు కొరత ఉన్నందువలన బూర్గంపాడు మండలం డేటా ఎంట్రీ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత కరకగూడెం, చర్ల మండలం డేటా ఎంట్రీ ప్రక్రియను చేపట్టాలని, భద్రాచలం ఆర్డీఓని పర్యవేక్షించాల్సిందిగా ఆదేశించారు. జిల్లాలో పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక కోసం తహసీల్దార్లు అందరూ క్షేత్రస్థాయిలో అన్ని గ్రామాల్లో పర్యటించి పేదలలో అత్యంత పేద వాళ్లకు మాత్రమే లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిల్లలతో జీవనం సాగిస్తున్న ఒంటరి మహిళలు, వితంతువులు, గుడిసెలలో జీవనం సాగిస్తున్న వారిని గుర్తించాలన్నారు.
తహసీల్దార్లు అందరూ ఈరోజు తమ పరిధిలోకి వచ్చిన దరఖాస్తులను ప్రత్యక్షంగా తనిఖీ చేసి, పేదవారిని గుర్తించి నివేదికలు అందజేయాలని ఆదేశించారు. గుర్తించిన పేదవారిని ఆర్డీఓలు క్షేత్రస్థాయిలో విచారించి తుది జాబితా సిద్ధం చేయాలని కొత్తగూడెం, భద్రాచలం ఆర్డీఓ లను ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపికలో అధికారులు, ఉద్యోగులు ఎటువంటి ఫైరవీలు, అవకతవకలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జిల్లాలో ఎవరైనా గిరిజనేతరులకి విభజన పేరుతో పట్టా మార్పు లేదా భూమి అమ్మకానికి అధికారులు సహాయం చేస్తే వారిని సస్పెండ్ చేయడంతో పాటు వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.