- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
దిశ,ముదిగొండ : వర్షాలు కురుస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ముదిగొండ, వల్లభి గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. మండల కేంద్రం ముదిగొండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. హాస్పిటల్లోని వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్ భవనం శిథిలావస్థకు చేరిందని సిబ్బంది తెలిపారు.
దానికి భట్టి విక్రమార్క మాట్లాడుతూ నూతన భవన నిర్మాణానికి అంచనా వేయడానికి అధికారులను పంపిస్తానని హామీ ఇచ్చారు. ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షానికి వల్లభి గ్రామంలోని చెరువు కట్ట తెగడంతో దాని కింద ఉన్న పంట పొలాలను పరిశీలించారు. పంట నష్టం అంచనా వేయాలని వ్యవసాయ అధికారిని ఆదేశించారు. వర్షాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గణేష్, తహసీల్దార్ కరుణాకర్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయాల నాగేశ్వరావు, అధికారులు, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.