- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తుమ్మలచెరువు చేపల సంపద ఆంధ్రాపాలా..?
దిశ, అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలంలో కాకతీయ కాలంనాటి వెయ్యి ఎకరాల విస్తీర్ణంలోని తుమ్మలచెరువు ఫిషరీస్ సొసైటీలో గిరిజన, ముదిరాజ్ పుత్రులు మాత్రమే ఉండాల్సి ఉంది. ఎన్నోఏళ్ల క్రితం నెల్లిపాకబంజర, దుమ్ముగూడెం గ్రామాలకు చెందిన పాతకాలం నాటి సొసైటీని బుర్గంపహాడు మండలానికి చెందిన ఓ రిటైర్డ్ ఉపాధ్యాయ ఉద్యోగి లీజుకు తీసుకున్నట్లు కలరింగ్ ఇస్తూ ఆంధ్రా కాంట్రాక్టర్‌లకు కట్టబెడుతూ లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారని చెరువు ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ చెరువులోని చేపలను పలు రాష్ట్రాల కంటైనర్ల ద్వారా సరఫరా చేసిన తర్వాతే ఆయకట్టు రైతులకు మిగిలిన చిన్న, చిన్న చేపలను అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చెరువు పరిధిలోని గిరిజనులు, ముదిరాజ్లకు ప్రతి ఏడాది వలలు వేయడం, మేత విసిరడం, పడవలు నడిపే మెళకువలు నేర్పిస్తారు. వాటి ఖర్చులకు ఫిషరీస్ సంస్థ నుంచి చెల్లిస్తున్నారు. అలాగే చెరువులో చేపలు పెంచడానికి సైతం పాల్వంచ దగ్గరలోని కిన్నెరసాని ఫిషరీస్ సంస్థ వారే చేప పిల్లలు సరఫరా చేస్తారు. ఈ నిబంధనలు ఏవి ఈయనకు వర్తించవు. ఈరిటైర్డ్ ఉపాధ్యాయ ఉద్యోగి ఆంధ్రా కాంట్రాక్టర్‌లకు, చేపలు పట్టేవారికి ధారాదరాదత్తం చేస్తున్నాడు. ఆయకట్టు రైతులపై ఈ ఆంధ్రా కాంట్రాక్టర్లే పెత్తనం చెలాయిస్తున్నారు. అశ్వాపురం మండలానికి గిరిజనులు, ముదిరాజ్ పుత్రులకు చెందాల్సిన లాభాలను ఆంధ్రావారికి కట్టబెడుతూ వీరికి అన్యాయం చేస్తున్నాడని వారు ఆవేదన వ్యక్త్తం చేస్తున్నారు. ఈరిటైర్డు ఉపాధ్యాయ ఉద్యోగిపై ఏ ఒక్కరు చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలకు తావిస్తున్నాయి. పోలీసులు సైతం ఆ సంపద కొల్లగొట్టేవారికి ఎందుకు రక్షణ కల్పిస్తున్నారని ఆయకట్టు రైతులు ఆగ్రహిస్తున్నారు.