సన్న బియ్యం పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అక్రమాలను సహించేది లేదు : సత్తుపల్లి ఎమ్మెల్యే

by Aamani |
సన్న బియ్యం పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అక్రమాలను సహించేది లేదు : సత్తుపల్లి ఎమ్మెల్యే
X

దిశ,తల్లాడ: మండలంలోని నారాయణపురం గ్రామంలో ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ బుధవారం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత సన్న బియ్యం పథకాన్ని లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్టా రాగమయి మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ పథకాలు పేద ప్రజల జీవితాల వెలుగు నింపేందుకు తీసుకు వస్తున్నామని అందులో భాగంగా ఉచిత సన్న బియ్యం పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని అందించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వచ్చిందని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలు ఆకలికి గురికాకుండా పోషకాహారాన్ని అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం అని ఎమ్మెల్యే అన్నారు. ఈ పథకాన్ని ప్రతి అర్హత కుటుంబానికి చేరేలా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ పథకం సజావుగా అమలు అవ్వాలని సన్న బియ్యం పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అక్రమాలను సహించేది లేదని ఎమ్మెల్యే ఉన్నత అధికారులను ఆదేశించారు.ఈ పథకం విజయవంతంగా అమలు కావడానికి ప్రజలందరూ కలిసి భాగస్వామ్యం కావాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మరియు ప్రభుత్వ అధికారులు మండల కాంగ్రెస్ నాయకులు,గ్రామ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు లబ్ధిదారులు పాల్గొనడం జరిగింది.



Next Story

Most Viewed