వేలంపాటలో పోటిపడి.. 3 లడ్డూలను కైవసం చేసుకున్న ముస్లింలు

by Mahesh |
వేలంపాటలో పోటిపడి.. 3 లడ్డూలను కైవసం చేసుకున్న ముస్లింలు
X

దిశ, ఖమ్మం సిటీ‌: స్థానిక 33వ డివిజన్ గాంధీనగర్ ప్రాంతానికి చెందిన ముస్లిం కుటుంబ సభ్యులు కులమతాలకు అతీతంగా హిందూ ముస్లిం ఐక్యతను చాటుతున్నారు. గత మూడు సంవత్సరాల నుంచి దేవీ నవరాత్రులు, గణేష్ నవరాత్రుల్లో వేలంపాటలో పాల్గొని పాడుకోవడం జరుగుతుంది. షేక్ లతీఫ్ ఒకేసారి ఈ ఏడాది మూడు లడ్డూలను కైవసం చేసుకున్నారు. రూ.20116 లకు ఒక లడ్డు పాడగా, మరో లడ్డూను రూ. 11,116 లకు, ఇంకొక లడ్డూను తన కుమారుడి పేరుతో లక్కీ డ్రా తీయగా.. ఆ లడ్డూను కూడా గెలుచుకోవడం జరిగింది.

ఈ విధంగా ఒకే ఏడాది మూడు లడ్డూలు కైవసం చేసుకోవడం ఒక ఎత్తు అయితే అవి ముస్లిం భక్తుడు లతీఫ్ కు రావడం మరో విశేషం. ఈ లడ్డూలను గెలుచుకోవడం పట్ల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ముస్లిం కుటుంబ సభ్యులు ఎస్ కే ఫిరోజ్ , ఎస్. కే యాకూబ్ , జానీ, బాల గణేష్ నవరాత్రుల ఉత్సవ కమిటీ నిర్వాహకులు మణికంఠ , శ్వేతార్ధ ఉత్సవ కమిటీ నిర్వాహకులు సుగుణ , శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు మలిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు .

Advertisement

Next Story

Most Viewed