- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులను రెచ్చగొట్టేందుకు దీక్షల పేరుతో కేసీఆర్ నటన : పొంగులేటి
దిశ, వైరా : రైతులను రెచ్చగొట్టి పార్లమెంటు ఎన్నికల్లో సానుభూతి పొందేందుకు మాజీ సీఎం కేసీఆర్ రైతు దీక్షల పేరుతో నటిస్తూ పంట పొలాలను పరిశీలిస్తున్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. వైరా లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు కర్రు కాచివాత పెట్టారని చెప్పారు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీతో పాటు ఆ పార్టీకి ఏ టీమైనా బిజెపి కు రాష్ట్ర ప్రజలు కర్రు కాచి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లోనే కాళేశ్వరం ప్రాజెక్టు దెబ్బతినటంతో నీటిని మొత్తం వేస్ట్ గా దిగువ ప్రాంతాలకు వదిలారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే నీటి కొరత ఏర్పడిందని ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకులు విమర్శించటం సిగ్గుచేటన్నారు.
రాష్ట్రంలో నీటి కొరత లేకుండా చేస్తామని సాగర్ జలాలతో ఈ ప్రాంత చెరువులు కుంటలను నింపి త్రాగునీటి ఇబ్బందులను తొలగిస్తామని వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పది సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రం ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్నదని చెప్పారు. ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో అప్పటి పాలకులు లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. నీటి సమస్యపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలను అన్నదాతలు ఎవరు నమ్మరని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని కుప్పిగంతులు వేసిన రైతులు ప్రజలు నమ్మరని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, మార్కుఫెడ్ రాష్ట్ర మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శీలం వెంకట నర్సిరెడ్డి, వైరా మున్సిపాలిటీ చైర్మన్ సూతకాని జైపాల్, కాంగ్రెస్ నాయకులు దాసరి దానియేలు, మిట్టపల్లి నాగి తదితరులు పాల్గొన్నారు.