మణుగూరులో ప్రపంచ వికలాంగుల దినోత్సవం

by S Gopi |   ( Updated:2022-12-03 15:58:16.0  )
మణుగూరులో ప్రపంచ వికలాంగుల దినోత్సవం
X

దిశ, మణుగూరు: మణుగూరు మెప్మా కార్యాలయంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగులతో కేక్ కట్ చేయించారు. అనంతరం మున్సిపల్ జెఏఓ రాజు మాట్లాడుతూ... వికలాంగులు ప్రతీ ఒక్కరూ ఓటు గుర్తింపు కార్డు కలిగివుండాలని సూచించారు. ఓటు గుర్తింపు కార్డు లేనివారు వెంటనే నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇంచార్జ్ టీఎంసీ నాజర్ అహ్మద్, సీఓ దుబాష్, శంకర్,దివ్యాoగుల అధ్యక్షులు షేక్ ఇమామ్,ఆర్ పి లు ఇందిర, రజిత మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed