- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన పొంగులేటి(వీడియో)
దిశ, ఖమ్మం: రాబోయే రాజకీయ కురుక్షేత్రంలో మీ శీనన్న యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పొంగులేటి శ్రీనివాసరెడ్డికి భద్రతా కుదింపు తర్వాత ఆదివారం ఖమ్మం నగరంలోని రామకృష్ణ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన రైట్ ఛాయిస్ అకాడమీ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు సెమినార్ కి అయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 13 ఏళ్ల రాజకీయ కాలంలో తాను గత ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల ఆశీర్వాదంతో ఎంపీగా గెలవడం జరిగిందన్నారు. పార్లమెంట్ సభ్యులుగా ఉన్న సమయంలో ప్రజలకు కావలసిన సదుపాయాలను ప్రభుత్వం ద్వారా అందించడం జరిగిందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ మారుమూల ప్రాంతాలకు వెళ్లినా మా శీనన్న అంటూ ప్రజలు గుండెల్లో పెట్టుకుని స్వాగతం పలుకుతున్నారన్నారు. గత నాలుగున్నర సంవత్సరాలలో తనను ప్రభుత్వాలు ఏ విధంగా చూశాయో చెప్పటం కన్నా మీరు ప్రత్యక్షంగా చూశారన్నారు. ప్రజల గుండెల్లో నిలిచినవాడే రాజకీయాల్లో రాణించి ప్రజలకు మెరుగైన అవసరాలు కల్పించే దిశగా పని చేస్తారన్నారు. రాబోయే ఎన్నికల్లో కురుక్షేత్రంలో మీ శీనన్న యుద్ధానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో అక్కడ ఉన్న నిరుద్యోగ యువత కేరింతలు చప్పట్లతో శీనన్న ప్రసంగాన్ని ఉత్సాహంగా విన్నారు.