- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపే ఎన్నికలు.. గ్రామాల్లో 144 సెక్షన్ అమలు
దిశ, ఖమ్మం రూరల్ : పాలేరు అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పాలేరు నియోజకవర్గం నుంచి పోలింగ్ స్టేషన్లకు ఈవీఎంలను తరలించారు. నియోజకవర్గంలోని 27 రూట్లకు గాను 289 పోలింగ్ స్టేషన్లకు 1269 మందిని ఎన్నికల నిర్వహణ కోసం నియమించారు. 318 మంది పోలింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు 313 మంది, ఓ పీవోలు 638 మంది విధుల్లో పాల్గొననున్నారు. ఈ సారి ఎన్నికల నిర్వహణకు జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశాల మేరకు పాలేరు నియోజకవర్గంలోని 289 పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ఆర్వో రాజేశ్వరి తెలిపారు. రూరల్ మండలంలోని గోళ్లపాడులో దివ్యాంగుల ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఖమ్మం రూరల్ మండలంలోని మహిళా మోడల్ పోలింగ్ స్టేషన్ గా దానవాయిగూడెం పోలింగ్ స్టేషన్ ను ఎంపిక చేశారు.
ఈ బూత్‌లో 688 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గుర్రలపాడు గ్రామంలో 134 బూత్‌ను మోడల్ మహిళా పోలింగ్ బూత్ గా ఎంపిక చేశారు. ఇందులో 703 మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రూరల్ మండలంలోని మోడల్ పోలింగ్ స్టేషన్ లుగా తల్లంపాడు, కొండాపురం, నాయుడుపేట, కూసుమంచి మండలంలోని పాలేరు, నేలకొండపల్లి మండలంలోని భైరవుని పల్లి బూత్‌లను మోడల్ పోలింగ్ బూత్‌ల కింద ఎంపిక చేశారు. తిరుమాలయపాలెం మండలంలోని సుబ్లేడు, కూసుమంచిలోని గోరిలపాడుతండా, నేలకొండపల్లి మండలంలోని రాజేశ్వరపురం పోలింగ్ బూత్‌లను మోడల్ మహిళా పోలింగ్ బూత్‌ల కింద ఎంపిక చేసి ఏర్పాటు చేశారు. పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఆర్వో తెలిపారు.
ఓటరు స్లిప్పులను గుర్తింపు కార్డుగా పరిగణలోకి తీసుకోబోమని, ఓటరు కార్డు లేదా ఇతర 12 రకాల కార్డుల్లో ఏదైనా ఒకటి తీసుకుని రావాలని ఆర్వో సూచించారు. రాజకీయ పార్టీలు ఇచ్చే ఓటరు స్లిప్పు పై అభ్యర్థి పేరు, గుర్తు, పార్టీ పేరు ఏవీ ఉండకూడదని, తెల్లకాగితం పై ముద్రించిన వాటిని మాత్రమే పోలింగ్ కేంద్రంలోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఈవీఎంల దగ్గరికి పోలింగ్ ఏజెంట్లు వెళ్లవద్దని, ఓటర్లు పోలింగ్ కేంద్రంలోకి ఫోన్ తీసుకొనిరావద్దని సూచించారు. ఓటింగ్ రహస్యంగా వేయాల్సి ఉంటుందని, ఓటును ఫొటో తీయడానికి కూడా వీలులేదని తెలిపారు.
రేపు సెలవు..
ఎన్నికల పోలింగ్ సందర్భంగా గురువారం ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, అన్ని విద్యాసంస్థలకు సెలవు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాలున్న విద్యాసంస్థలకు బుధ, గురువారాల్లో సెలవు ఇచ్చారు. ఎన్నికల విధుల్లో ఉన్న విద్యాశాఖ సిబ్బందికి బుధ, గురువారాల్లో సెలవుతోపాటు డిసెంబర్ 1న స్పెషల్ క్యాజువల్ లీవుగా ప్రకటించారు.