- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ ఎఫెక్ట్....సింగరేణి స్థలంలో వ్యాపారాలు నిర్వహించరాదు
దిశ, కొత్తగూడెం : ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల నిర్వహణ కోసం సత్యసాయి సేవా ట్రస్ట్ కి కేటాయించిన స్థలంలో ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించరాదని సింగరేణి సంస్థ స్పష్టం చేసింది. సత్యసాయి సేవా సమితి ట్రస్ట్ కి నోటీసులు జారీ చేసింది. సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉండగా, ఆర్థిక లబ్ధి కోసం ఏకంగా సింగరేణి స్థలంలో భారీ షెడ్డు నిర్మించి జిమ్ నిర్వాహకులకు
కిరాయికి ఇవ్వడం జరిగింది. ఇటీవల దిశ పత్రికలో సత్యసాయి ట్రస్ట్ వ్యవహారంపై పలు కథనాలు రావడంతో స్పందించిన సింగరేణి సంస్థ అధికారులు , ట్రస్ట్ నిర్వాహకులు వెంటనే వ్యాపార కార్యకలాపాలు నిలిపివేయాలని, ట్రస్ట్ కు ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలని నిర్వహించే ఉద్దేశంతో కేటాయించిన స్థలంలో, వ్యాపార కార్యక్రమాలు చేపడితే చర్యలు చేపడతామని నోటీసులు అందించారు. కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రమే నిర్వహించాలని సూచించారు.