ధరణి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి

by Sridhar Babu |
ధరణి పెండింగ్ దరఖాస్తులను  పరిష్కరించాలి
X

దిశ, కొత్తగూడెం : ధరణి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. జిల్లాలో ధరణి దరఖాస్తుల పరిష్కారం, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక, పీఎం కుసుమ్ పథకం, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే డేటా ఎంట్రీ తదితర అంశాలపై అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందనతో కలిసి ఆర్డీఓలు, తహసీల్దార్లు, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ధరణి మాడ్యూల్స్ లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో పరిశీలించి క్లియర్ చేయాలని అన్నారు. అన్ని మాడ్యూల్స్ లో దాఖలైన ధరణి దరఖాస్తులను పెండింగ్ ఉంచకుండా వెంటనే పరిష్కరించేందుకు చొరవ చూపాలని ఆదేశించారు.

ధరణి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. పెండింగ్ దరఖాస్తులు ఏ కారణంతోటి పరిష్కరించలేదో లిఖితపూర్వక సమాచారాన్ని పోర్టల్ లో నమోదు చేయాలని ఆదేశించారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే డేటా ఎంట్రీ వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట అదనపు కంప్యూటర్లు, అదనపు డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించుకొని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. డేటా ఎంట్రీ ప్రక్రియ పూర్తి చేసుకొని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక యాప్ ద్వారా పరిశీలన చేపట్టాలని అన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించాల్సిందిగా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ కు సూచించారు. పీఎం కుసుమ్ (ప్రధాన్ మంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్) పథకం కింద మహిళా సమాఖ్య ద్వారా 1 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ స్థాపనకు జిల్లాలోని విద్యుత్ సబ్ స్టేషన్ కు ఐదు కిలోమీటర్ల పరిధిలో అనువైన ప్రభుత్వ స్థలమును విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలల స్థాపనకు స్థలం గుర్తింపు ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని కొత్తగూడెం, భద్రాచలం ఆర్డీఓలను ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed