- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
దిశ, భద్రాచలం : అభివృద్ధి పనులు వేగవంతం చేసి, ఎవరి సిఫార్స్ లేకుండా అర్హులైన గిరిజన లబ్ధిదారులకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం భద్రాచలంలోని ఏఎంసీ కాలనీలో నిర్మాణం పూర్తయి ఖాళీగా ఉన్న ఇందిరమ్మ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఆయన పరిశీలించారు. 250 ఇండ్లు పూర్తయినా చిన్న చిన్న మరమ్మతుల కారణంగా ఖాళీగా ఉంచడంతో అవి పాడైపోవడానికి ఆస్కారం ఉంటుందని తెలిపారు. రూ.12 కోట్ల 62 లక్షలతో నిర్మాణం చేపట్టిన ఇండ్లు పేదవారైన గిరిజన లబ్ధిదారులను గుర్తించి అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను కోరారు.
ఏజెన్సీ ఏరియా పరిధిలో టెండర్లు పూర్తి అయినవి, సగం వరకు నిర్మాణం చేపట్టి మిగిలిపోయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఉంటే జిల్లా కలెక్టర్, పీఓ ద్వారా అనుమతులు తీసుకొని పూర్తి చేయాలని అన్నారు. దీనికి ముందు మంత్రి భద్రాచలం శ్రీసీతారామ చంద్ర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ జిల్లాలో ముగ్గురు మంత్రులం ఉన్నామని, రామాలయం అభివృద్ధి చేసి తీరుతామని, ఇప్పటికే భూ సేకరణ కోసం 60 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు.
అనంతరం స్థానిక కేకే ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయి అధికారుల సమీక్షా సమావేశంలో పాల్గొని నియోజకవర్గం అభివృద్ధి పై చర్చించారు. ప్రతి గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. అసంపూర్తి రహదారుల నిర్మాణాలు ఉంటే వెంటనే పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఏజెన్సీ గ్రామాలలో రహదారుల నిర్మాణం ఆగిపోతే కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, జారె ఆదినారాయణ, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్ పీ రోహిత్ రాజు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.