- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోర్టు స్థలాన్ని కొల్లగొడుతున్నారు
దిశ, కొత్తగూడెం : తన భవనాలకి మూడు పక్కలా రోడ్లు ఉండాలని భావించాడా కబ్జాదారుడు. అనుకున్న వెంటనే ప్రయత్నాలు ప్రారంభించాడు. వివరాల్లోకి వెళితే....సింగరేణి సంస్థకు చెందిన సుమారు రెండు వేల గజాల స్థలాన్ని 2018లో ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ప్రభుత్వం న్యాయశాఖకు ఆ స్థలాన్ని కేటాయించింది. తదనంతరం ఆ స్థలం చుట్టూ భవనాలు వెలిశాయి. తన భవనాలకి మూడు వైపుల నుండి దారులు ఉండాలనుకున్నాడు ఒక ఘనుడు. ఇప్పటికే తాను వ్యాపారం చేస్తున్న భవనానికి దారి కావాలని న్యాయశాఖకు కేటాయించిన స్థలం గోడలు రెండువైపులా కూలగొట్టి దారి ఏర్పరచుకొని వాడుకోవడంతోపాటు ప్రైవేటు వాహనాలను సైతం నిలుపుతున్నాడు.
ఇంతటితో ఆగని ఆ ప్రబుద్ధుడు పక్కనే నిర్మిస్తున్న తన నాలుగు అంతస్తుల భవనానికి మరొక దారి ఏర్పాటు చేసేందుకు ఏకంగా తన భవన సముదాయానికి ఇసుక కంకర లారీలు వచ్చే విధంగా న్యాయశాఖ స్థలం గోడలు కూలగొట్టి రోడ్డును ఏర్పాటు చేశాడు. ఇంతటితో ఆగని సదరు ఘనుడు తన భవన నిర్మాణానికి ఉపయోగించే కంకర, ఇసుక, ఇతర సామాగ్రిని న్యాయశాఖకు ఇచ్చిన స్థలంలోనే నిల్వ ఉంచుతున్నాడు.
ఇంత జరుగుతున్నా అధికారులు ఆ కబ్జాదారుడిపై చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కూలగొట్టిన చోట తిరిగి గోడలు కట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. కోర్టుకు సంబంధించిన అత్యంత విలువైన భూములని అన్యాక్రాంతం కాకుండా చూడాలని పలువురు లాయర్లు కోరుతున్నారు. గోడలు కూలగొట్టి తన భవనాలకు దారి ఏర్పర్చుకున్న కబ్జాదారుడిపై కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.