సింగరేణి సంస్థకు బొగ్గు గనులు కేటాయించాలి.. సీఐటీయు

by Sumithra |
సింగరేణి సంస్థకు బొగ్గు గనులు కేటాయించాలి.. సీఐటీయు
X

దిశ, టేకులపల్లి : 2024 జూలై 9 మంగళవారం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు గనులను సింగరేణి సంస్థకు కేటాయించాలని, బొగ్గు గనుల వేలాన్ని ఆపాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మందా నరసింహారావు, సీఐటీయూ జిల్లా అద్యక్షులు కొలగాని బ్రహ్మచారిలు డిమాండ్ చేశారు. మంగళవారం నాడు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ అధ్యక్షతన కోయగూడెం ఓసీలో జరిగిన ఫిట్ మీటింగ్ లో వారు మాట్లాడుతూ సింగరేణి సంస్థను కాపాడుకోవడం కోసం ఐక్యంగా పోరాడుదామని పిలుపునిచ్చారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకోడమే లక్ష్యంగా పని చేస్తుందన్నారు. వేల కోట్ల రూపాయల లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థకు నష్టం చేస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువైపు ఉంటుందో తేల్చుకోవాలన్నారు.

బీజేపీకి వత్తాసు పలికితే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు. సింగరేణి సంస్థ వేలంలో పాల్గొనవద్దని కోరారు. సింగరేణి సంస్థలో ఉన్న కార్మిక సంఘాలు సంస్థ పరిరక్షణా కోసం వేలాన్ని వ్యతిరేకిస్తూ ఐక్యంగా పోరాడుదామని పిలుపునిచ్చారు. కోయగూడెం ఓసీ - 3 బ్లాకు వేలాన్ని రద్దు సింగరేణి సంస్థకు కేటాయించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ఏ నబి, గుగులోత్ రాంచందర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఈసం నర్సింహారావు, కుంజ రమేష్, పూనెం సురేష్, జి.బాలక్రిష్ణ కేవోసీ కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed