- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నిలువుదోపిడీకి పాల్పడుతున్న షాపింగ్ మాల్స్...
దిశ ప్రతినిధి, కొత్తగూడెం : మహిళలకు బంగారం పై ఉన్న ఆసక్తిని క్యాష్ గా మలుచుకుంటున్నారు కార్పొరేట్ బంగారు వ్యాపారస్తులు. ఖమ్మం కొత్తగూడెం వంటి జిల్లా కేంద్రాలను టార్గెట్ గా చేసుకుంటూ హంగు ఆర్భాటాలతో కళ్ళు చెదిరే షోరూంలు ఏర్పాటు చేసి సంపన్న, మధ్యతరగతి, ప్రజలను టార్గెట్ చేస్తూ నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. రోజు రోజుకి బంగారం ధర పెరుగుతున్న క్రమంలో ఒక్కసారి కొనుగోలు చేయలేని పేద మధ్యతరగతి ప్రజల ఆశలను ఆసరాగా తీసుకొని స్కీముల పేరిట పెద్ద స్కాములకు పాల్పడుతున్నారు. కొత్తగూడెం, ఖమ్మం జిల్లా కేంద్రాలలో కార్పొరేట్ సంస్థ అయిన సీఎంఆర్ స్కీముల పేరిట కస్టమర్లను ఆకర్షించి కూడ పెట్టిన సొమ్మును కొల్లగొడుతున్నారు.
రంగుల బ్రోచర్లు తియ్యని మాటలతో కస్టమర్లకు గాలం.
ప్రజలను ఆకర్షించే విధంగా రంగురంగుల బ్రోచర్లు తియ్యని మాటలతో కస్టమర్లను ఆకట్టుకొని ప్రతినెల మీకు సాధ్యమైనంత కట్టుకోండి అలా 11 నెలలు కడితే చాలు ఒక బంగారు ఆభరణం మీ ఇల్లు చేరుతుంది. మీరు స్కీములో జాయిన్ అయినట్లయితే మీరు తీసుకునే ఆభరణం పైన ఎటువంటి తరుగు ఉండదు ఒకసరే ఆభరణం కొనాలంటే బోలెడంత ఖర్చుతో కూడుకున్న పని ఇలా స్కీములు కడితే బంగారం కొనుగోలు సులభతరం అవుతుంది. అంటూ కల్లబొల్లి మాటలు చెప్పి అమాయక ప్రజలను సీఎంఆర్ స్కీముల్లో జాయిన్ చేసి తీరా గడువు ముగిసే సరికి మీరు కట్టినంత డబ్బుకు మాత్రమే కొనుగోలు చేస్తే కుదరదు మీరు కట్టిన డబ్బుకు సరిపడా బంగారం ఇవ్వడం కుదరదు.
దానికంటే ఎక్కువ మోతాదులోనే కొనుగోలు చేయాలి అంటూ లేనిపోని నిబంధనలు కస్టమర్ల ముందు ఉంచుతూ తమ స్తోమతలకు మించి బంగారాన్ని కొనుగోలు చేపిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఉదాహరణకు 10 గ్రాములు స్కీమ్ ద్వారా పొందినట్లయితే 10 గ్రాములకు మించి కొనుగోలు చేస్తేనే వస్తువు ఇస్తామంటూ లేనిపోని ఆంక్షలు విధిస్తున్నారని కస్టమర్లు అంటున్నారు. అంతేకాక స్కీంలో జాయిన్ అయ్యేటప్పుడు కస్టమర్లు కట్టిన డబ్బుకు సరిపడా ఏ వస్తువు కోరుకుంటే ఆ వస్తువు చేసి ఇస్తామని చెప్పి తీరా స్కీమ్ ముగిసిన అనంతరం కస్టమర్ ఎంచుకున్న వస్తువు చేసి ఇవ్వడం సాధ్యం కాదని తమ వద్ద ఉన్న వస్తువునే ఎంచుకోవాలని నిబంధనలు పెడుతున్నారు.
బంగారు ఆభరణాల నాణ్యత అంతంత మాత్రమే. రూపాయి రూపాయి పోగేసి స్కీముల ద్వారా కొనుగోలు చేసిన బంగారం ఆభరణాలు మూడునాలకే ముక్కలవుతున్నాయి.కొనుగోలు చేసే కస్టమర్లకు వస్తువు గట్టిచేత అని అంటగట్టిన మూడు నాల్లకే ఇష్టపడి కొనుగోలు చేసిన వస్తువులు ముక్కలు అవుతుండడంతో కస్టమర్లు కోపోద్రక్తులు అవుతున్నారు. సీఎంఆర్ లో కొనుగోలు చేసిన బంగారు ఆభరణాలకు ఎటువంటి నాణ్యత లేకపోవడంతో కొంతమంది కస్టమర్లు ఆందోళన బాట పడుతున్నారు.
సీఎంఆర్ దుకాణ యాజమాన్యం అమ్మకాలు జరుపుతున్న బంగారు ఆభరణాలలోని రాళ్ల బరువు మినహాయిస్తున్నాము అంటూనే రాళ్ల విలువ వేళల్లో వసూలు చేస్తున్నారు. వాటి విలువ వేరే దుకాణాలతో పోలిస్తే సుమారు 75 శాతం అధికంగా కనబడుతుంది. ఒకవేళ స్కీమ్ కట్టిన కస్టమర్లు నచ్చిన వస్తువే కావాలని నిలదీస్తే ఆ వస్తువు చేపించడానికి సుమారు రెండు నెలలు సమయం పడుతుందంటూ కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్నారు. ఇలా స్కీములు కట్టి ఇంకెవరు మోసపోవద్దు అంటూ బాధితులు బాహాటంగానే ప్రచారం చేయడం విశేషం.