ఔట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి

by Sridhar Babu |
ఔట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి
X

దిశ, కొత్తగూడెం : జిల్లా వైద్య కళాశాలలో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసే ఉద్యోగాల కోసం http://kothagudem.telangana.gov.in సైట్లో పొందు పరిచినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధి కల్పనా శాఖ అధికారి వేల్పుల విజేత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున అర్హత గల అభ్యర్ధులు దరఖాస్తులను పూర్తి చేసి, ఫొటో తో పాటు విద్యార్హత పత్రాల నఖలు కాపీలను గెజిటెడ్ అధికారితో అటెస్ట్ చేయించి జిల్లా ఉపాధి కల్పనాధికారి, భద్రాద్రి కొత్తగూడెం కార్యాలయంలో ఈనెల 19వ తేదీ నుండి 25వ తేదీ వరకు దరఖాస్తులు అందజేయాలని ఆమె తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed