- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రూప్ 2 పరీక్షలకు సర్వం సిద్ధం
దిశ, కొత్తగూడెం : టీజీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. ఇందుకు పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 13465 మంది అభ్యర్థులు గ్రూప్ 2 పరీక్షకు హాజరుకానున్నారని ఇందుకు కొత్తగూడెం పట్టణంలో మొత్తం 38 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అభ్యర్థులందరూ పరీక్ష సమయానికి గంట ముందే కేంద్రాల వద్దకు చేరుకోవాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
పరీక్ష రాసే అభ్యర్థులు ఎటువంటి మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ వస్తువులను కేంద్రానికి తీసుకుని రావద్దని తెలిపారు. మెహందీ, టాటూలు వేసుకున్న వారిని పరీక్షకి అనుమతించబోమని తెలిపారు. పరీక్ష రాసే అభ్యర్థులు ఎటువంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాయాలని అభ్యర్థులకు సూచించారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని, ప్రతి అభ్యర్థి హాల్ టికెట్ ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం మాత్రమే అనుమతించాలని సిబ్బందికి సూచించారు.