వరి కోయలకు నిప్పు పెడుతూ రైతు మృతి..

by Sumithra |   ( Updated:15 May 2023 4:47 PM  )
వరి కోయలకు నిప్పు పెడుతూ రైతు మృతి..
X

దిశ, కూసుమంచి : మండలంలోని గైగోళ్లపల్లి పరిధిలోని హట్యాతండాకు చెందిన బాధవత్ మున్యానాయక్ (53) అనే రైతు ప్రమాదవశాత్తు మంటలలో చిక్కుకొని మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మున్యా నాయక్ తన పంట పొలంలోని వరి కోయలకు నిప్పుపెట్టాడు. ఈ క్రమంలో గాలి దుమారంతో ఒక్కసారిగా అతని బట్టలకు మంటలు వ్యాపించి అంటుకోగా అక్కడికక్కడే మృతి చెందాడు. దింతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Next Story