- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
3 పేపర్లు.. రూ.10 కోట్లు.. TSPSC పేపర్ లీకేజీ కేసులో బయటపడుతోన్న విస్తూపోయే నిజాలు!

దిశ, వెబ్‌డెస్క్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో అరెస్ట్ అయిన డీఈ రమేష్ రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు సంచలన విషయాలను పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ నిర్వహించే మూడు పరీక్ష పేపర్లను లీక్ చేసి రూ.10 కోట్లు సంపాదించాలని రమేష్ ప్లాన్ వేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇందులో భాగంగా ఏఈ పేపర్, డీఏవో పేపర్‌లను లీక్ చేసిన రమేష్.. 30 నుంచి 50 అభ్యర్థులకు పేపర్ విక్రయించాడని పేర్కొన్నారు. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.20 నుంచి 30 లక్షలకు బేరం కుదుర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అడ్వాన్డ్స్ టెక్నాలజీతో ఓ కంట్రోల్ రూమ్‌నే ఏర్పాటు చేసిన రమేష్.. పరీక్ష సెంటర్ల ఇన్విజిలేటర్స్‌ను ట్రాప్ చేశాడని పేర్కొన్నారు. ఇన్విజిలేటర్స్‌కు ముందుగానే డబ్బులు చెల్లించినట్లు తెలిపారు. దీంతో పరీక్ష పేపర్ ఇచ్చిన 5 నిమిషాలకే ఇన్విజిలేటర్ల ద్వారా రమేష్ వద్దకు చేరినట్లు పోలీసులు వెల్లడించారు. పేపర్ రాగానే ఏఐ టెక్నాలజీ అయిన చాట్‌జీపీటీ ద్వారా జవాబులు తెలుసుకొని బేరం కుదుర్చుకున్న అభ్యర్థులకు చేరవేశాడని తెలిపారు.
కాగా, ఈ పేపర్ల లీక్ కోసం రమేష్ ముందుగానే రెక్కీ నిర్వహించాడని పోలీసులు పేర్కొన్నారు. అయితే, ఈ లీకేజీ వ్యవహారంలో రమేష్‌కి సహకరించిన వారిపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక, పెద్దపల్లిలోని ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో డీఈగా పనిచేస్తున్న రమేష్.. తన భార్య హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.