SLBC టన్నెల్‌లో కొనసాగుతున్న రెస్క్యూ.. తవ్వకాల్లో కీలక పరిణామం

by Mahesh |
SLBC టన్నెల్‌లో కొనసాగుతున్న రెస్క్యూ.. తవ్వకాల్లో కీలక పరిణామం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సంచలనంగా మారిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం (SLBC tunnel accident) జరిగి 14 రోజులు గడిచిపోయాయి. ఈ ప్రమాదంలో నేడు 15వ రోజు (Day 15) టన్నెల్ లోపల రెస్క్యూ ఆపరేషన్ (Rescue operation) కొనసాగుతోంది. అయితే ప్రమాదం జరిగి 15 రోజులు అవుతున్న 8 మంది సిబ్బంది ఆచూకీ, ఆనవాళ్లు కూడా అధికారులు కనిపెట్టలేకపోయారు. కాగా ఈ రెస్క్యూ ఆపరేషన్ లో కేరళ నుంచి వచ్చిన ప్రత్యేక సిబ్బందితో పాటు ఇతర రెస్క్యూ టీమ్ కూడా వేగంగా తవ్వకాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో రోబొటిక్ టీమ్ కూడా రంగంలోకి దిగింది. అయితే ఈ రోజు ఉదయం ప్రారంభమైన తవ్వకాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు మినీ ప్రొక్లెయిన్స్ తో తవ్వకాలు జరిపించడం, కన్వేయర్ బెల్ట్ పునరుద్దరించడంతో రెస్క్యూ వేగం పెరిగింది.

ఈ క్రమంలో టన్నెల్ ప్రమాదం (Tunnel accident) జరిగిన ప్రాంతంలో రెండు స్పాట్లను రెస్క్యూ బృందాలు గుర్తించారు. అక్కడ ప్రస్తుతం మట్టి తొలగింపు (Soil removal) కొనసాగుతుండగా.. భారీగా దుర్వాసన వస్తున్నట్లు రెస్క్యూ టీమ్ సభ్యులు (Rescue team members) చెబుతున్నారు. దీంతో టన్నెల్ లోపల చిక్కుకున్న కార్మికులు ఇదు చోటు ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో టన్నెల్ బోరింగ్ మిషన్ పరికరాలు అడ్డు రావడంతో వాటిని మిషన్ సాయంతో రెస్క్యూ టీమ్స్ కట్ చేస్తున్నారు. ఏ క్షణంలోనైనా టన్నెల్ లోపల చిక్కుకున్న వారి ఆచూకీ లభ్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుండగంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఈ రోజు ఉదయం టన్నెల్ వద్దకు చేరుకొని.. ఆధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.



Next Story

Most Viewed