ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. హైకోర్టు సంచలన ఆదేశాలు

by Shiva |
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. హైకోర్టు సంచలన ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ డీసీపీ రాధాకిషన్ రావును ఈ నెల 12 వరకు అరెస్ట్ చెయోద్దని హైకోర్టు పంజాగుట్ట పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. తన‌పై పంజా‌గుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును కొట్టివేయాలంటూ రాధాకిషన్ రావు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై గురువారం ధర్మాసన విచారణ చేపట్టింది. ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారని కాంగ్రెస్ నేత, రియల్ ఎస్టేట్ వ్యాపారి ఛక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుతో పాటు రాధాకిషన్ రావు‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story

Most Viewed