గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డుల విషయంలో సర్కార్ కీలక నిర్ణయం

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-16 11:32:58.0  )
గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డుల విషయంలో సర్కార్ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు(ration cards), హెల్త్ కార్డు(Health cards)లను వేర్వేరుగా జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం(Telangana government) నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే అర్హుల ఎంపికకు అవసరమైన సిఫార్సులు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తాజాగా.. సోమవారం సచివాలయం వేదికగా కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్‌లో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు జారీ చేస్తామని పేర్కొన్నారు. నిబంధనలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వీలైనంత తొందరగా హెల్త్ కార్డులు, రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయానికి వచ్చారు. కాగా, ఈ సబ్ కమిటీకి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను సభ్యులుగా ప్రభుత్వం నియమించింది.

Advertisement

Next Story