- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సోమేశ్ కుమార్ మాయలో కేసీఆర్.. అసెంబ్లీలో CPI ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: ధరణిని ప్రవేశపెట్టిన తర్వాత గ్రామాల్లో అప్రకటితపు అల్లకల్లోలం నెలకొన్నదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో భూ సంస్కరణలపై ఆయన మాట్లాడుతూ.. అందరి సలహాలు తీసుకున్నామన్నారు. కానీ ఒక్కరి సలహా మాత్రమే పాటించారు. ఆయన సోమేష్ కుమార్. అంత పెద్ద మేధావిగా ఉన్న కేసీఆర్ సోమేష్ కుమార్ మాయలో పడ్డారు. రోబో సినిమాలో రోబో తయారు చేస్తాడు.. కానీ దాన్ని ఎలా నాశనం చేయాలో తెలియదు. ఇది కూడా అంతే. అస్త్రం వదిలారు. కానీ వెనక్కి తీసుకోలేదు. మంచి చేయాలనుకొని కేసీఆర్ చేశారు. కానీ ప్రతి గ్రామంలో సమస్యలు ఉన్నాయి. బీఆర్ఎస్ ఓటమికి కారణం ధరణియే. ప్రధానంగా కాస్తు కాలమ్ తీసేయడం వల్ల పెద్దోళ్లు అమ్మిన భూములు కూడా తిరిగి భూస్వాముల పేర్లతో వచ్చాయి.
దాంతో కాస్తు కాలమ్ నుంచి అనుభవిస్తున్న వాళ్లకు లోన్లు లేవు. రైతుబంధు రాలేదు. వందలు, వేల ఎకరాల జాగీర్దార్లకు వెళ్లింది. రేగళ్లలో కొన్ని వందల ఎకరాలు గిరిజనులకు రావాల్సిన భూమి. రైతుబంధు పెద్దాయనకే వెళ్లింది. పాత పట్టాదారులకే రైతుబంధు వచ్చింది. తెలంగాణలో సాదాబైనామాలు ఎక్కువ. కాస్తు కాలమ్ లో దళిత, గిరిజనులు ఉన్నారు. సాదాబైనామాతో కొనుగోలు చేసిన వారున్నారు. ఆన్ లైన్ ద్వారా స్వర్గం కనిపిస్తుందన్నారు. ఏ అవినీతి జరగకూడదన్నారో, ఎప్పుడూ లేనంతగా చోటు చేసుకుందన్నారు. జిల్లా కేంద్రాలు, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో స్లాట్లు బుక్ చేసుకొని ఇతరుల భూములను రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. అన్ని ప్రాంతాల్లో ఇలాంటి అవకతవకలు చోటు చేసుకున్నాయి. దీనిపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. భూముల సర్వే పేరిట ఒకరి భూమి మరొకరి పేరిట నమోదు చేశారన్నారు. కలెక్టర్ కి కూడా అధికారం లేదు.
ఆపరేటర్ ఓపెన్ చేస్తే తప్ప వివరాలు తెలియవు. ప్రతి దానికి కోర్టుకే వెళ్లాల్సి వస్తుంది. ఎమ్మాఆర్వోలు, కంప్యూటర్లు ఏం చేయాలనుకుంటే అది చేస్తున్నారు. ఆపరేటర్లు రింగ్ తిప్పే పరిస్థితి వచ్చిందన్నారు. క్విక్ డిస్పోజల్ బదులుగా సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ధరణి పోర్టల్ వల్ల వచ్చిందన్నారు. సమగ్ర భూ సర్వే చేయకుండా ధరణి పేరుతో పైపైన చేయడం వల్ల లొసుగులు తలెత్తాయన్నారు. కొన ఊపరితో బతికి ఉందన్నారు. భూమి పేరుతో అల్లకల్లోలం జరుగుతుందన్నారు. ఐఎల్ఎఫ్ఎస్ చేతిలో దాదాపు 1.60 కోట్ల ఎకరాలను, బతుకును ఎలా పెట్టారు? ఆస్తులన్నింటినీ ఓ ప్రైవేటు కంపెనీ చేతిలో ఎలా పెట్టారో ఆలోచించాలన్నారు. సీసీఎల్ఏ తలచుకుంటే ఏదైనా జరగొచ్చునని నాకు తెలిసిందన్నారు.