అలా జరిగితే గ్రూప్-1 ఎగ్జామ్ రద్దే అయ్యే ప్రమాదం.. CM రేవంత్ కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2024-07-09 14:49:02.0  )
అలా జరిగితే గ్రూప్-1 ఎగ్జామ్ రద్దే అయ్యే ప్రమాదం.. CM రేవంత్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు 1:100 పిలవాలని అభ్యర్థులు చేస్తోన్న డిమాండ్‌పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మంగళవారం సొంత జిల్లా మహబూబ్ నగర్‌లో పర్యటించిన రేవంత్.. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, ప్రాజెక్టులపై అధికారులతో రివ్యూ నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో పిలవాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ, 1:100 నిష్పత్తిలో పిలవాలనే డిమాండ్ వెనక ప్రతిపక్ష కుట్ర ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. డిమాండ్ మేరకు గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 పర్సంటేజీలో పిలిస్తే మళ్లీ వారు కోర్టుకు వెళ్తారని, దీంతో నోటిఫికేషన్‌లో లేకుండా 1:100 నిష్పత్తిలో ఎలా పిలుస్తారని కోర్టు పరీక్షను రద్దు చేస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నో ఏళ్లుగా జరగని డీఎస్సీని అడ్డుకోవాలని కొందరు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.

పదే పదే పరీక్షలను రద్దు చేయాలని ప్రతిపక్షం కుట్ర చేస్తోందని, ఎగ్జామ్‌లు పోస్ట్ పోన్ చేయాలనే డిమాండ్ వెనక కోచింగ్ సెంటర్ల కుట్ర కూడా దాగి ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు. పరీక్షలు వాయిదా వేయాలని కొన్ని కోచింగ్ సెంటర్ల యాజమానులు నన్ను కలిశారని.. వాళ్ల వ్యాపారం కోసమే కోచింగ్ సెంటర్ల నిర్వహకులు వాయిదా కోరతున్నారని చెప్పారు. నిరాహార దీక్షల్లో పేద విద్యార్థులు, పేద నేతలు మాత్రమే కూర్చుకుంటున్నారు, కేటీఆర్, హరీష్ రావు ఎందుకు కూర్చొవడం లేదు అని ప్రశ్నించారు. దమ్ముంటే పరీక్షల వాయిదా కోసం కేటీఆర్, హరీష్ రావు ఆర్ట్స్ కాలేజ్ ముందు దీక్షకు కూర్చొవాలని సవాల్ విసిరారు. ప్రభుత్వం వాళ్ల దీక్షకు రక్షణ కల్పిస్తుందని స్పష్టం చేశారు. పార్టీ రాజకీయాంగా చచ్చినప్పుడల్లా విద్యార్థుల చావులతో బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు. పరీక్షలు వాయిదా వేస్తే తనకు, కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టమేమి లేదని.. అభ్యర్థులే నష్టపోతారని అన్నారు. పరీక్షలు పోస్ట్ పోన్ అయితే లక్షలాది మంది విద్యార్థుల జీవితాల ఆగం అవుతాయని.. నిరుద్యోగులు ప్రతిపక్షాల ట్రాప్‌లో చిక్కుకోవద్దని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed