TSRTC ఆస్తుల అమ్మకంపై డిప్యూటీ CM భట్టి కీలక ప్రకటన

by Satheesh |   ( Updated:2024-03-12 07:22:39.0  )
TSRTC ఆస్తుల అమ్మకంపై డిప్యూటీ CM భట్టి కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: టీఎస్‌ఆర్టీసీ ఆస్తుల అమ్మకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీ ఆస్తులు అమ్మే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందని స్పష్టం చేశారు. ఇవాళ టీఎస్ఆర్టీసీకి చెందిన 25 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం, కోమటిరెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. టీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం సహకారం ఎప్పుడు ఉంటుందని తెలిపారు. గతంలో ఆర్టీసీ సిబ్బంది జీతాల కోసం ఇబ్బంది పడ్డారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం ఉద్యోగులు సమయానికి జీతాలు అందిస్తోందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లోని ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, మహాలక్ష్మీ పథకాలను అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే అమలు చేశామని అన్నారు.

Advertisement

Next Story