Telangana Chief Minister: సీఎంగా కేసీఆర్ అరుదైన ఫీట్.. ఆ విషయంలో నయా రికార్డ్

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-31 09:56:49.0  )
Telangana Chief Minister: సీఎంగా కేసీఆర్ అరుదైన ఫీట్.. ఆ విషయంలో నయా రికార్డ్
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ మరో అరుదైన ఫీట్ సొంతం చేసుకోనున్నారు. తెలంగాణ సాధనే లక్ష్యంగా పార్టీ స్థాపించిన ఆయన తెలుగు సీఎంలలో అరుదైన ఘనత సొంతం చేసుకోనున్నారు. ఏకబిగిన రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు పాలించి ఈ ఘటన సాధించిన తొలి తెలుగు సీఎంగా చరిత్ర పుటల్లో నిలిచారు. ఇప్పటి వరకు మొత్తం 24 మంది తెలుగు సీఎంలలో ఎవరికి దక్కని కీర్తి గులాబీ బాస్ సొంతం చేసుకున్నారు.

జూన్ 2తో రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు పూర్తవుతుంది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఆయనే తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2014 జూన్ 2న తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 2023 జూన్ 2తో తొమ్మిదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మూడు విడతల్లో 13 ఏళ్ల 247 రోజులు సీఎంగా ఉన్నారు. కానీ ఏకబిగిన ఆయన సీఎం కొనసాగింది 8 ఏండ్ల 256 రోజులు మాత్రమే. సో ఈ లెక్కన తెలుగు సీఎంలలో కేసీఆర్ మాత్రమే ఎక్కువ రోజులు కంటిన్యూగా సీఎంగా పని చేసి నయా రికార్డు సృష్టించారు.

Advertisement

Next Story