- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓవైసీ అనుమతి ఉంటేనే కేసీఆర్ అక్కడికి వస్తాడు.. : కిషన్ రెడ్డి
దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్రం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్‌లో సెప్టెంబర్ 17విమోచన ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన పార్టీ స్టేట్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతారని వెల్లడించారు. విమోచన ఉత్సవాలు బీజేపీ కార్యక్రమం కాదని గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తున్నామన్నారు.
ఓవైసీ అనుమతి ఉంటేనే సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 17 కార్యక్రమానికి హాజరవుతారన్నారు. రాష్ట్రపతి నిలయంలో కూడా తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మజ్లిస్ పార్టీకి లొంగిపోయి ఇచ్చిన వాగ్దానాన్ని కేసీఆర్ విస్మరించారని విమర్శించారు. సమైక్యత దినోత్సవం కాదు.. విమోచన దినోత్సవాన్ని తెలంగాణ సర్కార్ అధికారికంగా నిర్వహించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని మండిపడ్డారు. మాజీ సీఎం రోశయ్య పంచలూడదీయాలని పిలిపునిచ్చిన కేసీఆర్ ఇప్పుడెందుకు విమోచన దినోత్సవాన్ని నిర్వహించటం లేదని ప్రశ్నించారు.
విమోచన దినోత్సవంలో మొదటి ద్రోహి కాంగ్రెస్.. రెండో ద్రోహి బీఆర్ఎస్ అని తెలిపారు. తెలంగాణ చరిత్రను తొక్కిపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని మండిపడ్డారు. కర్ణాటక, మహారాష్ట్రలో హైదరాబాద్ ముక్తి దివస్‌ను నిర్వహించిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. విమోచన ఉత్సవాలు నిర్వహించాల్సిందిగా.. తెలంగాణలోని అందరూ సర్పంచ్ లకు లేఖలు రాస్తున్నామని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్‌పై కిషన్ రెడ్డి స్పందిచారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరీ చంద్రబాబు అరెస్ట్‌ను తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. ముందస్తు నోటీసులు, ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారని తెలిసిందని వెల్లడించారు.