- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం.. కేసీఆర్ సెన్సేషనల్ కామెంట్స్
దిశ, వెబ్ డెస్క్: మునుగోడు ఉపఎన్నిక ఎలాంటి అవసరం లేకుండా వచ్చిందని.. ఫలితాన్ని కూడా మీరు ఎప్పుడో తేల్చేశారని సీఎం కేసీఆర్ అన్నారు. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ తలపెట్టిన భారీ బహిరంగా సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొంతమంది ఢిల్లీ బ్రోకర్ గాళ్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని వచ్చారని.. వందకోట్లకు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని చూశారని వ్యాఖ్యానించారు. కానీ రూ. 100 కోట్ల ఆఫర్‌ను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎడమ కాలితో తన్నారని పేర్కొన్నారు. తెలంగాణ అంటే అమ్ముడుపోయేది కాదని.. చెప్పుతో కొట్టినట్లు నలుగురు ఎమ్మె్ల్యేలు సమాధానం చెప్పారని కీలక వ్యాఖ్యలు చేశారు. అంగట్లో పశువుల్లా అమ్ముడు పోకుండా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జాతి గౌరవాన్ని కాపాడారని ప్రశంసలు కురిపించారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనడానికి వందల కోట్లు ఎక్కడి నుండి వచ్చాయని.. దీనిపై విచారణ జరగాలని.. దీని వెనుక ఎవరు ఉన్నారో తేలాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుంటే మౌనం పాటిద్దమా అని ప్రశ్నించారు. రాజకీయం అంటే అమ్ముడుపోవడం కాదని తమ ఎమ్మెల్యేలు నిరూపించారని అన్నారు. ప్రధాని మోడీ గారు మీకు ఇంకా ఏంకావాలని.. రెండు సార్లు ప్రధానిగా చేసికూడా ఇలాంటి అరాచకాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎలక్షన్ వస్తే గాయ్.. గాయ్.. గత్తర్ గత్తర్ లొల్లి నడుస్తోందని అన్నారు. ఎన్నికల్లో ఒళ్లు మరిచి ఓటు వేస్తే ఇల్లు కాలిపోతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. బావ చెప్పిండనో.. బావమర్ది చెప్పిండనో.. డ్యాన్సులు చేశారనో ఓట్లు వేయొద్దని సూచించారు.