MP Lxman : కేసీఆర్, రేవంత్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు : ఎంపీ లక్ష్మణ్

by M.Rajitha |
MP Lxman : కేసీఆర్, రేవంత్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు : ఎంపీ లక్ష్మణ్
X

దిశ, వెబ్ డెస్క్ : బీజేపీ ఎంపీ కే. లక్ష్మణ్(BJP MP Laxman) నేడు మాజీ సీఎం కేసీఆర్(Former CM KCR), ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పైన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండ బీజేపీ కార్యాలయం(Nalgonda BJP Office)లో జరిపిన మీడియా సమావేశంలో ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. కేసీఆర్, రేవంత్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చరాని మండిపడ్డారు. మాజీ సీఎం రాష్ట్రం మీద రూ.7 లక్షల కోట్లు అప్పు చేసి రేవంత్ రెడ్డి చేతుల్లో పెట్టారని, ప్రస్తుత సీఎం అనుభవం లేక రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలో పడేశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఇచ్చే బెనిఫిట్స్(Retirement Benefits) ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ కోసం కోర్టుకు వెళ్ళి సాధించుకోవాల్సిన దారుణ ఆర్థిక పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సరైన వైద్య సేవలు అనడటం లేదని, బిల్లులు చెల్లించకపోవడంతో ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ఆసుపత్రులు పట్టించుకోవడం లేదని వాపోయారు. ఐదేళ్లకు ఓసారి పీఆర్సీ(PRC) అమలు చేయాల్సి ఉండగా.. దానిని పట్టించుకోవడం లేదని, ఐదు డీఏలను పెండింగ్ లో పెట్టిందని తెలియజేశారు.



Next Story

Most Viewed