- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KCR దగ్గర ఏం సమాచారం ఉంది..? గులాబీ బాస్ ప్రెస్‌మీట్‌పై పోలీసు, రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ
దిశ, క్రైమ్ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం చేసిన కామెంట్స్‌పై ఇప్పుడు పోలీసులు వర్గాల్లో ఉత్కంఠను రేపుతోంది. ‘రెండు మూడు రోజుల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మొత్తం చెబుతాను’ అని అనడంతో పోలీసుల్లో టెన్షన్ మొదలైంది. ప్రెస్‌మీట్‌లో ఏం చెబుతాడు..? ట్యాపింగ్‌కు సంబంధించి ఆయన వద్ద ఎలాంటి సమాచారం ఉంది..? ఎవరి పేర్లైనా బయట పెడతాడా..? అన్న చర్చ కొనసాగుతోంది. రెండు పర్యాయాలు సీఎంగా కొనసాగిన కేసీఆర్ హయాంలో అనురాగ్ శర్మ, మహేందర్‌రెడ్డి, అంజనీకుమార్ పోలీస్ బాసులుగా కొనసాగారు. ఇంటలిజెన్స్ చీఫ్శివథర్రెడ్డి, నవీన్‌చంద్, కొన్ని రోజుల ఇన్‌చార్జిగా ప్రభాకర్‌రావు, అనిల్‌కుమార్ పనిచేశారు. ఎస్ఐబీ చీఫ్‌గా సజ్జనార్, ఆ తర్వాత ప్రభాకర్‌రావు బాధ్యతలు నిర్వహించారు.
కేసీఆర్ ప్రకటన తర్వాత ఎవరి పేర్లు బయటకు వస్తాయన్న టెన్షన్ గతంలో పనిచేసిన ఆఫీసర్లకు పట్టుకుంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్ పేర్లు వస్తాయని అందరూ అనుకుంటున్న తరుణంలో కేసీఆర్ఏం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది. రాధాకిషన్‌రావు ఇప్పటికే బీఆర్ఎస్ సుప్రీమ్ అంటూ తన వాంగ్మూలంలో పలు మార్లు ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తప్పంతా పోలీసుల మీదకు నెట్టేసి కేసీఆర్ తన మాటల గారడీతో నమ్మిస్తాడనే ప్రచారం జరుతోంది. తన హయాంలో పని చేసిన పోలీసు బాసులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసే స్కెచ్ వేశాడని అధికారులు అనుకుంటున్నారు. 2015లో జరిగిన ఓటుకు నోటు కేసు గురించి మాట్లాడి అధికారులను ఇబ్బందుల్లోకి పడేస్తాడా అనే టాక్ నడుస్తోంది.