- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యుత్ కొనుగోలులో కేసీఆర్ తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవాలి: సీపీఎం
దిశ, డైనమిక్ బ్యూరో: రాజకీయ కక్ష సాధింపు కోసమే విద్యుత్తు కొనుగోళ్ళపై విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేశారని, విచారణ పూర్తికాకుండానే కమిషన్ మీడియా సమావేశంలో మాట్లాడిందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎదురుదాడికి దిగడం సహేతుకం కాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం భావించారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. విచారణ పారదర్శకంగా లేకపోవడంతో తాను కమిషన్ ముందు హాజరుకాను అని, కమిషన్ చైర్మన్ స్వచ్ఛందంగా తప్పుకోవాలని కేసీఆర్ చెప్పడం ఆశ్చర్యకరమన్నారు. గత ప్రభుత్వ హయాంలో చత్తీస్‌ఘడ్ ప్రభుత్వంతో జరిగిన విద్యుత్తు ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలను కేసీఆర్ సమర్ధించుకున్నారని ఆరోపించారు.
మార్కెట్‌లో తక్కువ రేటుకు విద్యుత్తు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నప్పటికీ చత్తీస్‌ఘడ్‌తో ఒప్పందం చేసుకోవడంపైన ఆనాడే విమర్శలు వచ్చాయని గుర్తుచేశారు. దీనిపై ప్రజలకు అనేక అనుమానాలున్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత బీఆర్‌ఎస్ నాయకత్వంపైన ఉన్నదని స్పష్టంచేశారు. అవసరమైతే విచారణ చేసుకోండి అని గతంలో ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు ప్రభుత్వం కుట్రపూరితంగా విచారణ చేయిస్తున్నదని ఆరోపించడం అవకాశవాదమేనని అభిప్రాయపడ్డారు. కమిషన్ లేవనెత్తిన అన్ని అంశాలపై, ప్రజలలో నెలకొన్న అనుమానాలకు పూర్తి వివరణ ఇచ్చి కేసీఆర్ తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవాలని సీపీఎం కోరుతున్నదని పేర్కొన్నారు. అదే సందర్భంలో విచారణ పూర్తి కాకుండానే కమిషన్ మీడియా సమావేశం నిర్వహించడం కూడా సరైంది కాదని అభిప్రాయపడ్డారు.