- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Dilawarpur : దిలావర్ పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులిచ్చిందే కేసీఆర్
దిశ, వెబ్ డెస్క్ : ప్రజాందోళనలకు కారణమైన నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ(Dilawarpur ethanol factory)అనుమతుల(permissions) విషయమై బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య పరస్పర ఆరోపణల పర్వం కొనసాగుతోంది. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పీఆర్వో బోరెడ్డి అయోధ్య రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దిలావర్ పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీకి ఇవ్వాల్సిన అనుమతులన్నీ ఇచ్చింది బీఆర్ఎస్ అధినేత, అప్పటి సీఎం కేసీఆర్(KCR) అని అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను పోస్టు చేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులపై అయోధ్య రెడ్డి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. అప్పటి మంత్రి తలసాని కుటుంబం కోసం ఆగమేఘాలపై ఫ్యాక్టరీకి అనుమతులు ఇప్పించిందే కేసీఆర్ అని, పర్యావరణ శాఖ అనుమతి ఇవ్వని ఉత్పత్తులకు కేబినేట్ ను ఒప్పించిందే కేసీఆర్ అని, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఈ ఫ్యాక్టరీకి మినహాయింపులు ఇవ్వాలని ఒత్తిడి చేసిందే కేసీఆర్ అని అయోధ్య రెడ్డి వెల్లడించారు. అప్పటి టీఎస్ ఐపాస్ సిస్టమ్ ద్వారా అన్ని నిబంధనలు ఉల్లంఘించి కేసీఆర్ అనుమతులు ఇప్పించాడని, ఎదురుదాడి విమర్శలేమో ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పైనా? అని ప్రశ్నించారు. ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతుల పత్రాలపై సంతకం పెట్టింది ఎవరో.. గుర్తు పట్టండంటూ కేటీఆర్, హరీష్ రావులను సూటిగా సవాల్ చేశారు. ఇప్పుడు దిలావర్ పూర్ రైతులకు క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాయాల్సింది ఎవరంటూ అయోధ్య రెడ్డి ప్రశ్నించారు.
అనుమతుల్లో అడ్డదారులు
ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్న దిలావర్‌పూర్ ప్రజలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కావటంతో.. ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ ఎంక్వెరీ రిపోర్టులో దిలావర్పూర్ లో ఇథనాల్ కంపెనీకి నిబంధనలు అన్నీ తుంగలో తొక్కి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక మినహాయింపులతో అనుమతులిచ్చినట్లుగా గుర్తించింది. పర్యావరణ శాఖ ఇచ్చిన అనుమతులను కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కంపెనీ ఉల్లంఘించినట్లు వెల్లడైంది. ఫ్యూయల్ ఇథనాల్ సాకును చూపించి ఏకంగా ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా మినహాయింపు పొందేందుకు ఈ కంపెనీ అడ్డదారులు అనుసరించిందని అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో వెల్లడైంది. కేంద్ర ప్రభుత్వం ఫ్యూయల్ ఇథనాల్ కు అనుమతి ఇస్తే.. అదేమీ పట్టించుకోకుండా ఇథనాల్, ఎక్స్ ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (ఈఎన్ఏ), ఇండస్ట్రియల్ స్పిరిట్స్, అబ్జల్యూట్ ఆల్కహాల్ లాంటి అన్ని ఉత్పత్తులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ మంత్రివర్గంలో అనుమతులు ఇచ్చారని తేలింది. అదీ కూడా ర్యాటిఫికేషన్లో తీసుకున్నట్లు గుర్తించారు. 2022 అక్టోబర్ లో 600 లక్షల లీటర్ల ఇథనాల్, ఎక్స్ట్రా మ్యాట్రల్ ఆల్కహాల్, ఇండస్ట్రియల్ స్పిరిట్స్, అబ్జల్యూట్ ఆల్కహాల్ తయారీకి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇండెంట్ జారీ చేసింది. అప్పటి రాష్ట్ర కేబినెట్ ఆమోదం లేకుండానే 'అత్యవసరం' పేరిట ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే ఆ ఏడాది డిసెంబర్ లో కేబినెట్ ఈ నిర్ణయాన్ని ర్యాటిఫై చేసినట్లు పేర్కొన్నారు.
ఇథనాల్ తయారీకి కేంద్ర ప్రభుత్వ పర్యావరణ అనుమతి తీసుకోవటం తప్పనిసరి. లెటర్ ఆఫ్ ఇండెంట్లో ఇథనాల్, ఎక్స్ ట్రా మ్యాట్రల్ ఆల్కహాల్, ఇండస్ట్రియల్ స్పిరిట్స్, అబ్జల్యూట్ ఆల్కహాల్ తయారీని అని పేర్కొన్నారు. కానీ.. కేంద్ర పర్యావరణ శాఖకు మాత్రం 'ఫ్యూయల్ ఇథనాల్' కోసమని దరఖాస్తు చేశారు. ఇలా కంపెనీ సమర్పించిన స్వీయ ధ్రువీకరణ ఆధారంగా ఈ ఫ్యాక్టరీ బీ2 కేటగిరీకి వస్తుందని చెప్పి ఏకంగా ప్రజాభిప్రాయ సేకరణ నుంచి మినహాయింపు పొందారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పర్యావరణ అనుమతి ప్రకారం అక్కడి స్థానిక సంస్థల (గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ) నుంచి పీఎంకే డిస్టిలేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) తీసుకోకుండానే నిర్మాణ పనులు చేపట్టారని తేలింది.