పొత్తు పెట్టుకుంటే కేసీఆర్ ఫ్యామిలీ ఖేల్ ఖతం : కేఏ పాల్ (వీడియో)

by Rajesh |   ( Updated:2023-10-10 15:47:34.0  )
పొత్తు పెట్టుకుంటే కేసీఆర్ ఫ్యామిలీ ఖేల్ ఖతం : కేఏ పాల్ (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కేసీఆర్‌పై 90 శాతం వ్యతిరేకత ఉందని ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ అన్నారు. కాంగ్రెస్‌కు 1 శాతం మాత్రమే ఓటు బ్యాంక్ ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ అని మోడీ, కేసీఆర్‌లు బెస్ట్ ఫ్రెండ్స్ అని ఈ విషయం చాలా మందికి తెలియదన్నారు. ‘దిశ’ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేఏ పాల్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కేఏ పాల్ ఎక్కడ కనిపించలేదనే ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థులైన వారు తనతో టచ్ లో ఉన్నారనే ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.

పొత్తుల కోసం అన్ని పార్టీలు తనను సంప్రదిస్తున్నాయని తాను కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే కేసీఆర్ కుటుంబంలో ఒక్కరు కూడా గెలవరని అదే తాను బీఆర్ఎస్‌తో పొత్తు కుదుర్చుకుంటే కాంగ్రెస్, బీజేపీకి ఒక్కసీటు కూడా రాదన్నారు. జూపల్లి, పొంగులేటిలు కాంగ్రెస్‌లో చేరితే ప్రజలే వారికి గుండుకొట్టిస్తారని హాట్ కామెంట్స్ చేశారు. వారిద్దరు ప్రజాశాంతిలో చేరితే 10 సీట్లు ఇచ్చి గెలిపించుకుంటామన్నారు. కేసీఆర్, కేటీఆర్, బండి సంజయ్, రేవంత్ రెడ్డిల కంటే తననే ఎక్కువ మంది ప్రజలు సీఎంగా కోరుకుంటున్నారని తాను లైఫ్‌లో ఎన్నడు ఓడిపోలేదని ఒక వేళ ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోకుంటే నష్టపోయేది ప్రజలే అన్నారు.

వివేకానంద హత్య కేసులో పెద్దలతో మాట్లాడి సీబీఐకి వార్నింగ్ ఇచ్చి మరి అవినాశ్ రెడ్డికి బెయిల్ ఇప్పించానన్నారు. అన్ని విషయాల్లో ఫెయిల్ అయిన జగన్‌కు, వైసీపీకి తానెందుకు సపోర్ట్ చేస్తానన్నారు. 75 ఏళ్లలో తెలుగు రాష్ట్రాలకు ఒక్క బీసీ కూడా ఎందుకు ముఖ్యమంత్రి కాలేకపోయారని ప్రశ్నించారు. ప్యాకెజ్ స్టార్ లాంటి పవన్ కళ్యాణ్ వల్ల కాపులకు చెడ్డపేరు వస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి అమ్ముడు పోతాడని తాను ముందే చెప్పానని అన్నారు.

దేశంలోని సంస్థలను మోడీ ప్రభుత్వం అప్పనంగా అమ్ముతుంటే కేసీఆర్, జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఏనాడైనా ప్రశ్నించారా అని మండిపడ్డారు. భారత్ ప్రపంచానికి విశ్వగురువుగా మారడం కాదని దోచుకుంటున్న అదానికి దోచిపెట్టడంలో నెంబర్ వన్‌గా మారిందన్నారు. క్యూబా లాంటి చిన్న దేశాలు ఉచిత విద్యా, వైద్యం అందిస్తుంటే భారత్ ఎందుకు ఇవ్వలేకపోతోందని నిలదీశారు. భారత్ లో పుష్కలంగా వనరులు ఉన్నా ఉపయోగించుకోవడం లేదని మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed