హరీష్ రావును ఫ్రంట్ సీట్‌లో కూర్చోబెట్టుకొని కార్ డ్రైవింగ్ చేసిన KCR

by Gantepaka Srikanth |
హరీష్ రావును ఫ్రంట్ సీట్‌లో కూర్చోబెట్టుకొని కార్ డ్రైవింగ్ చేసిన KCR
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) మరోసారి యాక్టీవ్ అయ్యారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోయి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఫామ్ హౌజ్‌కే పరిమితం అయిన ఆయన.. అనూహ్యంగా శుక్రవారం ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై హాట్ కామెంట్స్ చేశారు. ‘గతంలో ఎన్నో ప్రభుత్వాలను చూశాం. కానీ ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. ఎడాదిలోనే ఇంత వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఏకైక పార్టీ కాంగ్రెస్. ఆ పార్టీ లీడర్లు కనిపిస్తే జనాలు కొట్టేలా ఉన్నారు’ అని కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ప్రజలు ఏ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు..? ఫామ్ హౌజ్(KCR Farm House) పాలనా..? లేక ప్రజాపాలన అని సోషల్ మీడియా(X)లో పోస్టు పెడితే 70శాతానికి పైగా బీఆర్ఎస్‌కు ఓటేశారు. దాంతోనే కాంగ్రెస్‌పై ఉన్న వ్యతిరేకత ఏంటో తెలుస్తోంది అని కేసీఆర్ అన్నారు. ‘ఫిబ్రవరి చివరల్లో భారీ బహిరంగసభ పెట్టి ప్రభుత్వాన్ని ఎండగడదాం. నేను గంభీరంగా, మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నాను. కొడితే మామూలుగా కాదు.. గట్టిగా కొట్టడం నాకున్న అలవాటు’ అని కేసీఆర్ అన్నారు.

ఇదిలా ఉండగా.. ఎర్రవెల్లిలో నిర్వహించిన సమావేశానికి ముందు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. స్వయంగా కేసీఆరే కారు నడుపుతూ మీటింగ్‌కు వచ్చారు. ఆ కారు ఫ్రంట్ సీట్‌లో మాజీ మంత్రి హరీష్ రావును కూర్చోబెట్టుకొని మరీ వచ్చారు. దీంతో ఆ సమావేశానికి వచ్చిన బీఆర్ఎస్ నేతలంతా హర్షం వ్యక్తం చేశారు. ఆ సమావేశంలో హరీశ్ రావుతో పాటు సునీతా లక్ష్మారెడ్డి సహా పలువురు ముఖ్య నాయకులు హాజరయ్యారు.


Next Story

Most Viewed