మాకు ఓనర్‌షిప్ ఇవ్వలేదు.. KCRపై కడియం సంచలన వ్యాఖ్యలు (వీడియో)

by Sathputhe Rajesh |
మాకు ఓనర్‌షిప్ ఇవ్వలేదు.. KCRపై కడియం సంచలన వ్యాఖ్యలు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల బీఆర్ఎస్ పార్టీని వీడిన స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్‌పై మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్న వారందరినీ కూడా ఏదో ఒక కంపెనీలో పనిచేసే కార్మికులుగా చూస్తున్నారే తప్పా.. అందరికీ పార్ట్ నర్స్ అనే ఫీలింగ్ పార్టీ ఎప్పుడూ ఇవ్వలేదన్నారు. తమకు ఎన్నడూ పార్టీలో ఓనర్ షిప్ రాలేదన్నారు. ఓనర్ షిప్ లేని పార్టీలో మనసు పెట్టి పనిచేయడం కష్టమవుతుందన్నారు. కేసీఆర్ మీకు ఏం తెలుసు అన్నట్లుగా తమ అభిప్రాయాలను లైట్ తీసుకునే వాళ్లని కడియం ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కడియం శ్రీహరి పార్టీని వీడిన సందర్భంగా బీఆర్ఎస్ నేతలంతా ఆయనపై మాటల దాడి చేసిన విషయం తెలిసిందే. కేటీఆర్ అయితే రాజకీయాల్లో కేసీఆర్‌కు కడియం చేసిన నమ్మక ద్రోహం ఎవరూ చేయలేదన్నారు.



Next Story

Most Viewed