- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్, చంద్రబాబు, మోడీ, రేవంత్ అందరూ ఒకటే: కేఏ పాల్
దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో నూటికి తొంభై శాతం కుటుంబ, అవినీతి పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కుటుంబ పాలనను ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే.. లిబీయాలో ప్రజాస్వామ్యం లేదు కాబట్టి గడాఫీ 40 సంవత్సరాలు పాలించారని, ఇరాక్‌లో సద్దం హుస్సేన్ వారి కుటుంబం 30 సంవత్సరాలు పైగా పాలించారని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యం ఉన్న దేశాల్లో కుటుంబ పాలన లేదని, మన ఇండియాలో ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీ, వైఎస్సార్సీపీ, జనసేన ఇలా తదితర పార్టీల్లో కుటుంబ, అవినీతి పాలన ఉందన్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు ప్రతి ఒక్కరు కృషి చేశారని, అక్కడ అన్ని కులాలు మతాలు కష్టపడితేనే కాంగ్రెస్ గెలిచిందని స్పష్టంచేశారు. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ లేదని, తెలంగాణలో ఒక శాతం.. ఏపీలో ఒక శాతం కూడా లేదని విమర్శించారు. కర్ణాటకలో కాంగ్రెస్‌కు కేఏపాల్ సపోర్ట్ చేశారని, చిత్త శుద్ది ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని సూచించారు. తనను గెలిపించడానికి ఒక వరంగల్ ఎక్స్ కాంగ్రెస్ ఎంపీ కాల్ చేశారని తెలిపారు. మనకు కుల పాలన, కుటుంబ, అవినీతి పాలన వద్దన్నారని ఎంపీ చెప్పారని వెల్లడించారు.
ఇటీవల మహారాష్ట్ర లోకల్ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పార్టీ ఓడి పోయిందని, కర్ణాటకలో జేడీఎస్‌కు సపోర్ట్ చేస్తే పది శాతం సీట్లు కూడా రాలేదన్నారు. సీఎం కేసీఆర్ బుద్ధి చెప్పాలని, ఆయన పాఠం నేర్చుకోవాలని విమర్శించారు. కేసీఆర్, చంద్రబాబు, మోడీ, రేవంత్ అందరూ ఒకటే అని విమర్శించారు. వారు బహుజనులకు రాజ్యాధికారం లేకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని రకాల అభివృద్ధి జరగాలంటే ప్రజాశాంతి పార్టీకి ఓటేయాలని పిలుపునిచ్చారు.