- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KCR: భువనగిరి, నల్లగొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఫిక్స్!.. గెలుపు కోసం కేసీఆర్ పక్కా ప్లాన్
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ మొదలైంది. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆయా పార్టీల అధినేతలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్నారు. అంగబలం, అర్థబలం ఉన్న నాయకులను పోటీలో పెట్టి ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో పథకాలను రచిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో బీజేపీ అధినాయకత్వం మెజారిటీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. అదేవిధంగా అధికార కాంగ్రెస్ సైతం ఐదు స్థానాలకు గాను తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.
అదేవిధంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలైన బీఆర్ఎస్ పది స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, భువనగిరి అభ్యర్థులను కూడా దాదాపు ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. నల్గొండ ఎంపీ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి అభ్యర్థిగా బూడిద భిక్షమయ్య గౌడ్ పేర్లను కేసీఆర్ ఫైనల్ చేసినట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. కంచర్ల కృష్ణారెడ్డి స్వయాన నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సోదరుడు. అయితే, ఆయన మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా సీటు ఆశించారు.
కానీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మునుగోడు ఆయన మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనూ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో ప్రస్తుతం గులాబీ బాస్.. కృష్ణారెడ్డికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న మంచి పేరును దృష్టిలో పెట్టుకుని నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరును ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. కాగా, ఇప్పటికే కాంగ్రెస్ నుంచి కుందూరు రఘువీర్ రెడ్డిని, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డిని నల్లగొండ ఎంపీ అభ్యర్థులగా ప్రకటించాయి.
అదేవిధంగా భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బూర నర్సయ్య గౌడ్‌ను పార్టీ అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది. దీంతో గులాబీ బాస్ వ్యూహాత్మంగా బీఆర్ఎస్ తరఫున బీసీనే బరిలోకి దించాలని నిర్ణయించారు. ఈ మేరకు బూడిద భిక్షమయ్య గౌడ్‌ను అభ్యర్థిగా ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. భిక్షమయ్య గౌడ్ గతంలో ఆలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ నేపథ్యంలో నల్లగొండ, భువనగిరిలో ఎవరు గెలిచి నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.