- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కమలం గూటికి కవిత?.. కేసీఆర్ పై బీజేపీ బిగ్ స్కెచ్
దిశ, డైనమిక్ బ్యూరో:ఎంపీ ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారంలో ఉండగా కేసీఆర్ వెన్నంటే నడుస్తామని చెప్పిన కీలక నేతలు అధికారం దూరం కావడంతోనే ఒక్కొక్కరుగా పార్టీ నుంచి జారుకుంటున్నారు. ఇప్పటికే ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు, మరి కొంత మంది కీలక నేతలు కారు దిగిపోగా అదే బాటలో మరికొంత మంది ముఖ్యమైన నాయకులు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఎంపీ ఎన్నికల్లో ఎలాగైనా పరువు నిలబెట్టుకోవాలని చూస్తున్న కేసీఆర్ పై బీఆర్ఎస్ బిగ్ స్కెచ్ వేస్తోందని ఈ దెబ్బతో మరి కొంత మంది సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు సైతం బీఆర్ఎస్ ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారనే చర్చ జోరందుకుంది. ఈ మేరకు వీరిలో కొందరు ఇప్పటికే ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో సంప్రదింపులు సైతం పూర్తి చేసుకున్నారని టికెట్ విషయంలో కన్ఫర్మేషన్ రాగానే కండువా మార్చడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది.
కవితతో పాటు మరికొంత మంది కీలక నేతలు?:
బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు వెంకటేశ్ నేత, బీబీ పాటిల్, రాములు ఇప్పటికే పార్టీ మారగా వీరిలో ఇద్దరికి బీజేపీ టికెట్లు కేటాయింది. దీంతో మిగతా బీఆర్ఎస్ లోనే కొనసాగితే రాజకీయ మనుగడ కష్టం అని భావిస్తున్న నేతలు పక్క చూపులు చుస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో మహబూబాబబాద్ ఎంపీ మాలోత్ కవిత బీజేపీలో చేరబోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కవితకు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కు మధ్య కొంత కాలంగా కోల్డ్ వార్ నడుస్తోందని దీంతో ఈసారి ఎంపీ టికెట్ తనకే ఇవ్వాలని సత్యవతి రాథోడ్ అధిష్టానం వద్ద ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో కవిత పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇక హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావుతో కలిసి వెళ్లి ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారని నల్గొండ ఎంపీ టికెట్ సైతం ఆయనకు కన్ఫార్మ్ అయినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నల్గొండలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని బరిలోకి దింపతేనే పోటీలో ఉండవచ్చనే అంచనాలతో సైదిరెడ్డిని బీజేపీ గాలం వేస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఇక వీరితో పాటు సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, నామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీ సీతారాంనాయక్, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ వంటి వారి పేర్లు సైతం పార్టీ మారే వారి జాబితాలో వైరల్ అవుతున్నాయి. పార్టీ మారబోతున్నారనే అనుమానాలు ఉన్న చోట్ల ఇతర అభ్యర్థుల కోసం బీఆర్ఎస్ ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టగా పార్టీ అవకాశం ఇస్తే ఖమ్మం పార్లమెంటుకు మెచ్చా నాగేశ్వరరావు, మహబూబాబాద్ స్థానానికి రేగా కాంతారావు సిద్ధంగా ఉన్నామని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు టాక్ వినిపిస్తోంది.
కేసీఆర్ కు ఉక్కిరిబిక్కిరి:
అధికారం కోల్పోయాక తమ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెడుతుంటే.. మరో వైపు ఎంపీ ఎన్నికల వేళ అండగా నిలుస్తారనుకున్న సిట్టింగ్ ఎంపీలో జంప్ కావడం కేసీఆర్ కు రాజకీయంగా ఉక్కిరిబిక్కిరి చేస్తోందనే చర్చ వినిపిస్తోంది. బీఆర్ఎస్ ను వీడుతున్న నేతలపై స్పందిస్తూ టేకిట్ లైట్ అనేలా కేసీఆర్ వ్యాఖ్యలు చేసినా అదంతా ఆయన మేకపోతు గాంభీర్యమే అనే వాదన వినిపిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ లు మొదలు పెట్టిన ఆపరేష్ ఆకర్ష్ లో కేసీఆర్ కు దెబ్బమీద దెబ్బ తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే కీలక నేతలు ఇటు కాంగ్రెస్, అటు బీజేపీతో టచ్ లో ఉన్నారని అదును చూసి ప్లేట్ ఫిరాయించడం పక్కా అని ఈ దెబ్బతో కేసీఆర్ కు మరిన్ని ఇక్కట్లు తప్పవనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎవరు ఎలాంటి డిసిషన్ తీసుకుంటారో తెలిగయా బీఆర్ఎస్ క్యాడరే కాదు నాయకులు సైతం ఉత్కంఠగా చూస్తున్నట్లు తెలుస్తోంది.