దేశ రక్షణలో యువత భాగస్వాములు కావడం అభినందనీయం : Minister Gangula Kamalakar

by Shiva |   ( Updated:2023-08-28 14:30:37.0  )
దేశ రక్షణలో యువత భాగస్వాములు కావడం అభినందనీయం : Minister Gangula Kamalakar
X

దిశ, క‌రీంన‌గ‌ర్ : దేశానికి సేవ చేయాలనే ఆలోచనతో దేశ రక్షణలో యువత భాగస్వాములు కావడం అభినందనీయమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కొత్తపల్లి మండల కేంద్రంలోని స్థానిక ఫంక్షన్ హాల్లో ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ వారు ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి మంత్రి గంగుల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశ రక్షణ అనేది పవిత్ర వృత్తి అని.. దేశ రక్షణలో తమ పిల్లలు ఉండాలని కోరుతూ తల్లిదండ్రులు శిక్షణకు పంపడం అభినందనీయమని అన్నారు.

కన్న తల్లిదండ్రులను మనం ఎలా గౌరవిస్తామో దేశాన్ని కూడా అలాగే గౌరవించాలని అన్నారు. ఇంటర్ నుంచి దేశ రక్షణలో భాగస్వాములు కావాలని బాధ్యతగా ఎదుగుతున్న యువత భవిష్యత్తు గొప్పగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, ట్రస్మ చైర్మన్ శేఖర్ రావు, డిఫెన్స్ అకాడమీ చైర్మన్ సతీష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed